YS Sharmila Party: వైయస్ షర్మిలకు మొదటిలోనే పార్టీ లో చుక్కెదురు.. ఆ నేత రాజీనామా.. ( వీడియో )
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామంటూ ప్రత్యేక పార్టీకి సన్నాహాలు చేస్తున్న వైయస్ షర్మిలకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతుంది.
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామంటూ ప్రత్యేక పార్టీకి సన్నాహాలు చేస్తున్న వైయస్ షర్మిలకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతుంది. పార్టీకి అండగా ఉంటామన్న నేతలు అప్పుడే అలకపానుపు ఎక్కుతున్నారు. షర్మిల ఇటీవల నియమించిన అడహక్ కమిటీకి ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు. తెలంగాణలో జూలై 8న కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు వైయస్ షర్మిల ఇప్పటికే ప్రకటించారు. పార్టీ సంస్ధాగత నిర్మాణం కోసం జిల్లాల వారీగా అడహక్ కమిటీలను కూడా నియమించారు. పార్టీ ఏర్పాటు తర్వాత నేతల పనితీరును బట్టి పూర్తి స్థాయిలో నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. అయితే పార్టీ పెట్టక ముందే షర్మిల నియమించిన హడక్ కమిటీలకు వైయస్‌ఆర్ అభిమానులు రాజీనామాలు చేయడం కలకలం రేపుతోంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అసలైన వైఎస్సార్ అభిమానులకు పార్టీలో గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన చెందుతూ దేవరకద్రకు చెందిన కేటీరెడ్డి అడ్‌హాక్ కమిటీకి రాజీనామా చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Vulture: ప్రపంచంలో మొదటిసారిగా రాబందుకు కృత్రిమ కాలు.. వైద్యుల అద్భుత సృష్టి.. ( వీడియో )
Viral Video: వీధుల్లో కుల్ఫీ అమ్ముతున్న ట్రంప్-అసలు కథ వేరే.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. ( వీడియో )
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్న ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే
