Telugu Students: ఉక్రెయిన్ నుంచి బయటపడ్డ భారతీయులు.. హైదరాబాద్ చేరిన తెలుగు విద్యార్థులు

|

Feb 27, 2022 | 9:44 AM

యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. ఇప్పటివరకు రెండు విమానాల్లో 469 మందిని ఢిల్లీ తీసుకొచ్చారు. తెలుగు విద్యార్థులను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు.

Telugu Students: ఉక్రెయిన్ నుంచి బయటపడ్డ భారతీయులు.. హైదరాబాద్ చేరిన తెలుగు విద్యార్థులు
Telugu Students
Follow us on

Russia Ukraine Crisis: యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. ఇప్పటివరకు రెండు విమానాల్లో 469 మందిని ఢిల్లీ తీసుకొచ్చారు. తెలుగు విద్యార్థులను ఏపీ భవన్‌కు, తెలంగాణ భవన్‌కు తరలించారు. వారిని స్వస్థలాలకు పంపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అప్పటివరకు అక్కడే బస కల్పించారు. బుకారెస్ట్ నుంచి ఢిల్లీకి రెండో విమానంలో 250మంది భారత్ చేరుకున్నారు. ఇందులో 11మంది ఏపి విద్యార్థులు, 17మంది తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. ముంబై చేరుకున్న విమానంలో ఉన్న 20 మంది తెలుగు విద్యార్థులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. నిన్న ఉక్రెయిన్ నుంచి ముంబైకి విమానంలో 219మంది విద్యార్థులు చేరుకున్నారు. ఇప్పటివరకు ఉక్రెయిన్ నుంచి భారత్ కు 469మంది విద్యార్థులను క్షేమంగా తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం.

మూడ్రోజులు మూడు యుగాలుగా గడిపారు. క్షణ క్షణం.. భయం భయం.. ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణంలో బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం చూపిన చొరవతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు ఉక్రేనియన్‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు. ఉక్రెయిన్ నుండి ప్రత్యేక విమానంలో 20 మంది తెలుగు విద్యార్థులు ముంబైకి చేరుకున్నారు. అక్కనుండి ఇండిగో విమనంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తెలంగాణ ప్రభుత్వం తరపున రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్వాగతం పలికారు

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఇప్పటికే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు 20 మంది విద్యార్థులు చేరుకున్నారు. ముంబై నుంచి ఇండిగో విమానంలో వీరంతా ఎయిర్‌పోర్టుకు వచ్చారు. విద్యార్థులను చూసిన తల్లిదండ్రులు ఉద్వేగానికి లోనయ్యారు. విద్యార్థులను సేఫ్‌గా ఇండియాకు తీసుకొచ్చిన ఏపీ, తెలంగాణతో పాటు ఇండియన్‌ ఎంబసీకి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఎయిర్‌పోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ విద్యార్థులకు స్వాగతం పలికారు.

జహోనీ క్రాసింగ్ వద్ద ఉక్రెయిన్ నుంచి హంగేరీలో భారతీయ విద్యార్థులు బ్యాచ్‌లు ప్రవేశిస్తున్నారని హంగేరీలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అక్కడి నుంచి బుడాపెస్ట్‌కు వెళతారు. ఎయిర్ ఇండియా మూడో విమానం ద్వారా భారతదేశానికి తీసుకువెళతారని అధికారులు తెలిపారు. దీనితో పాటు, ఉక్రెయిన్ నుండి హంగేరి మీదుగా బయలుదేరే భారతీయ విద్యార్థులకు ఎంబసీ కూడా సలహా ఇచ్చింది.