Sajjanar: ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో 1.21కోట్ల మంది ప్రయాణికులు.. వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన సజ్జనార్..

|

Jan 17, 2023 | 6:24 AM

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ముందు వరసలో ఉంటుంది. పెద్ద పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయినవాళ్ల మధ్య పండుగ జరుపుకోవాలనుకుంటారు....

Sajjanar: ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో 1.21కోట్ల మంది ప్రయాణికులు.. వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన సజ్జనార్..
Rtc Md Sajjanar
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ముందు వరసలో ఉంటుంది. పెద్ద పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయినవాళ్ల మధ్య పండుగ జరుపుకోవాలనుకుంటారు. దీంతో స్వస్థలాలకు పయనమవుతుంటారు. వీరి అవసరాన్ని గమనించిన తెలంగాణ ఆర్టీసీ.. పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపించింది. వివిధ రాయితీలు, ఆఫర్లతో జనాలను ఆకర్షించే ప్రయత్నాలు చేసింది. కాగా.. ఇవి సత్ఫలితాలు ఇచ్చినట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 11 నుంచి 14 వరకు 1.21 కోట్ల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని తెలిపారు.

గతేడాది సంక్రాంతితో పోలిస్తే దాదాపు 5 లక్షలు మంది ఎక్కువగా బస్సుల్లో ప్రయాణించారు. ఈ నెల 11 నుంచి 14 వరకు 3,203 ప్రత్యేక బస్సులు నడిపించాం. పండుగ రోజుల్లో 2,384 బస్సులను నడపాలని నిర్ణయించినా.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనంగా మరో 819 బస్సులను నడిపాం. సంక్రాంతికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన వారికి ధన్యవాదాలు. భవిష్యత్తులోనూ ఆర్టీసీకి ఇలాంటి ఆదరణే ఇవ్వాలి.

          – వీసీ సజ్జనార్, టీఎస్ఆర్టీసీ ఎండీ 

ఇవి కూడా చదవండి

మరోవైపు.. మూడు రోజుల పండగ సమయాలను మనసులో నిక్షిప్తం చేసుకుని తిరిగి పట్నానికి పయనమవుతున్నారు. దీంతో విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద వాహనాలు బారులు తీరాయి. భారీగా వాహనాలు వస్తుండటంతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..