TGIIC వేలం ప్రక్రియ రికార్డుల మోత.. రాయదుర్గం మక్తాలో ఎకరాకు అన్ని కోట్లా

TGIIC వేలం ప్రక్రియలో రికార్డుల మోత మోగింది. ఎకరాకు 237 కోట్ల ధర పలికింది. 6 ఎకారాలకు వేలం ద్వారా సర్కార్‌ ఖజానకు 14వందల 90 కోట్ల రాబడి వచ్చింది. జూన్‌ ఫస్ట్‌న మరో ఎకరాల వేలానికి సిద్దమవుతోంది TGIIC. ..

TGIIC వేలం ప్రక్రియ రికార్డుల మోత.. రాయదుర్గం మక్తాలో ఎకరాకు అన్ని కోట్లా
Land Auction (Representative Image)

Updated on: May 28, 2026 | 9:02 PM

త్రి టిలియన్‌ డాలర్స్‌   ఎకానమి లక్ష్యంగా రేవంత్‌  సర్కా ప్రణాళికలకు పదను పెడుతోంది. సర్కార్‌ వారి సంకల్పమే బాటగా TGIIC వేలం ప్రక్రియలో రికార్డుల మోత మోగిస్తోంది.  లేటెస్ట్‌గా  రాయదుర్గం మక్తా ఏరియాలో  ఎకరా ధర  237 కోట్లు పలకడం రికార్డులకే రికార్డులు.   ప్రభుత్వం నిర్ణయించింది 139 కోట్లయితే..అందుకు 70.5 శాతం  కన్నా ఎక్కువ రేటుతో   237 కోట్లకు  ప్రముఖ గౌర వెంచర్‌  రాయదుర్గం మక్తాలో ఎకరా ల్యాండ్‌ను చేజిక్కించుకుంది.

సర్వే నెం. 83/1లో 6.29 ఎకరాలకు వేలం

ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా  తెలంగాణ ఇండస్ట్రియల్‌  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌   కార్పొరేషన్‌ లిమిటెడ్‌  మార్పు మార్క్‌ చాటుతోంది. రాయుదర్గం మక్తా ఏరియాలోని   83/1   సర్వే నెంబర్‌ లో 6 ఎకరాల 29 గుంటలకు  TGIIS  వేలం నిర్వహించింది. MSTC ప్లాట్‌ఫామ్‌ ద్వారా నిర్వహించిన e -ఆక్షన్‌ పాత రికార్డులను తుడిచి వేస్తూ  ఆల్‌ టైమ్‌ హై  అనేలా కొత్త రికార్డును క్రియేట్‌  చేసింది. ఎకరాకు 237 కోట్లు ..అంటే మాములా!  రిజర్వ్ ప్రైస్ 139 కోట్ల కంటే 70 శాతం ఎక్కువకు పాట  పాడారంటే సామాన్యమా?  ఎకరాకు 237 కోట్లు ..తెలుగు రాష్ట్రాల్లోనే కాదు  ..సౌతిండియాలో ఇది హయ్యెస్ట్‌ రేట్‌. ఇది హైదరాబాద్‌ పొటెన్షియాల్టీకి బెంచ్‌ మార్క్‌ అంటోంది TGIIC.  ప్రపంచ వ్యాప్తంగా  ఇన్వెస్టర్లు హైదరాబాద్‌ను గ్రోత్‌ కారిడార్‌గా చూస్తున్నారనడానికి ఇదే నిదర్శనమంటున్నారు TGIIC  అధికారులు.

గతేడాది ఎకరాకు రూ. 177 కోట్లు

గతేడాది ఇదే రాయదుర్గంలో  TGIIC వేలం ప్రక్రియను నిర్వహించింది. అప్పుడు ఎకరాకు  ధర రూ.177 కోట్లు పలికింది. అదే గ్రేట్‌ అనుకున్నారు.కానీ ఎకరాకు 237 కోట్లు  పలకడం  సంచలనం సృష్టించింది, తగ్గేది లేదన్నట్టు 237 కోట్లతో  ఎకరా ల్యాండ్‌ను చేజిక్కించుకున్న గౌర వెంచర్స్‌.. ఐటీ టవర్స్‌ను నిర్మించే యోచనలో వుందనే టాక్‌ విన్పిస్తోంది.

రాయదుర్గం మక్తా  ప్రైమ్‌ ఏరియాలోని  ప్లాట్ నెం. 1A & 1/F  వేలం ప్రక్రియ  ద్వారా  సర్కార్‌ ఖజానాకు   14 వందల 90 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఇక జూన్‌  ఫస్ట్‌ను  ఇదే ఏరియాలోనిని  మరో  5.09  ఎకరాలకు సంబంధించి వేలం ప్రక్రియ కోసం సమాయత్తమవుతున్నారు TGIIC  అధికారులు.

పెట్టిన పెట్టుబడికి ధీటుగా రిటర్స్స్‌ గ్యారెంటీ అనే నమ్మకంతో  ఇన్వెస్టర్లు  హైదరాబాద్‌ నే సేఫెస్ట్‌ కారిడార్‌గా భావిస్తున్నారు. TGIIC  వేలం ప్రక్రియ నాట్‌ ఓన్లీ తెలంగాణ దేశ రియల్‌ ఎస్టేట్‌ చరిత్రలో కొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ, కోకాపేట  పేర్లు వాల్డ్‌వైడ్‌గా మార్మోగుతున్నాయి.

Follow Us