Hyderabad: పాతబస్తీ బండ్లగూడలో సినీ ఫక్కీ తరహాలో దారిదోపిడీ జరిగింది. రోడ్డుపై సైడ్ ఇచినట్టే ఇచ్చి స్వల్పంగా బైక్‌కు తగిలి దుర్భాషలాడసాగారు. వెనుక నుంచి మరో రెండు బైక్ లపై నలుగురు వ్యక్తులు పై పైకి వస్తుండడాన్ని గమనించిన బాధిత వ్యక్తులు భయంతో తమ పల్సర్ బైక్‌తో ముందుకెళ్లారు. అయితే, మూడు బైక్ లపై వెంబడించిన ఆరుగురు వ్యక్తులు బండ్లగూడలో చేస్ చేసి పట్టుకున్నారు. సినిమా తరహలో పల్సర్ బైక్ ను రౌండప్ చేశారు. దుర్భాషలాడుతూ చితకబాదారు. పర్సులో ఉన్న 30 వేల రూపాయలతో పాటు రెండు సెల్ ఫోన్‌లు, పల్సర్ బైక్‌తో ఉడాయించారు. ఈ ఘటన తో పాతబస్తీ ఉలిక్కిపడింది. బాధితులు చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు..
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడ లేమూర్‌కి చెందిన సుధాకర్ (23) అలియాస్ లడ్డు ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సుధాకర్ స్నేహితుడు తుక్కుగూడ సరస్వతి గూడెంకు చెందిన సురేష్ (24)స్థానికంగా వ్యవసాయ పనులు చేస్తున్నాడు. సుధాకర్, సురేష్ లు కలిసి సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మండి బిర్యానీ తినడానికి తుక్కుగూడా నుంచి షాహిన్ నగర్ రూట్‌లో టిఎస్ 07 ఎఫ్‌టిఎల్ 1328 నెంబర్ గల పల్సర్ బైక్ పై వెళ్తున్నారు. మార్గమధ్యలో షాహిన్ నగర్ వద్ద ఒక బైక్ సైడ్ ఇచినట్టే ఇచ్చి అడ్డుగా వచ్చి సురేష్ బైక్ ను చిన్నగా తగలారు. బైక్‌ల పై నుంచి ఎవరు కింద పడలేదు.. కానీ, సుధాకర్ తప్పుచేసినట్లుగా సదరు వ్యక్తులు అతనితో వాగ్వాదానికి దిగారు. సుధాకర్ ను దుర్భాషలాడుతున్న క్రమంలోనే వెనుక నుంచి మరో రెండు బైక్ లపై నలుగురు వ్యక్తులు దగ్గరికి రావడాన్ని చూసి భయపడి ఎర్రకుంట మీదుగా బండ్లగూడ వైపు బైక్ తో ముందుకు వెళ్లాడు సుధాకర్.
అయితే, మూడు బైక్ లపై వెంబడించిన ఆరుగురు వ్యక్తులు బండ్లగూడ రోడ్డు వరకు సుధాకర్‌ను వెంబడిస్తూ వచ్చారు. అక్కడ సుధాకర్ పల్సర్ బైక్ ను రౌండప్ చేశారు. ఆరుగురు వ్యక్తులు దుర్భాష లాడుతూ సుధాకర్, సురేష్ లపై దాడికి దిగారు. అందులో ఒకరు ఇద్దరు జేబుల్లోంచి రెండు సెల్ ఫోన్ లను లాక్కున్నాడు. మరొకడు సుధాకర్ జేబులో 30 వేల నగదుతో ఉన్న పర్సును దౌర్జన్యంగా లాగేసుకున్నాడు. ఇదంతా గమంచిన సమీప దుకాణం యజమాని, అటుగా వస్తున్న మరో ఆటోడ్రైవర్ ఇద్దరు కలిసి ఘటనా స్థలికి వచ్చారు. ఇంతలోనే ఆ ఆరుగురు వ్యక్తులు సుధాకర్ పల్సర్ బైక్‌తో సహా ఉడాయించారు. దుకాణం యజమాని, ఆటోడ్రైవర్ ల సహాయంతో సుధాకర్, సురేష్ లు చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
Seethakka: ప్రభుత్వం అందుకే దళిత బంధు తెచ్చింది.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు
AP Inter Admissions-2021: ఏపీలో ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదల చేసిన ఇంటర్ బోర్డు