
నిర్మల్ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతి కొలువైన బాసర ప్రధాన ఆలయంలో భారీ చోరీ జరిగింది. ముగ్గురమ్మలు కొలువైన బాసర ఆకయంలోని మొదటి అంతస్తులో ఉన్న మహాకాళి అమ్మవారి ఆలయాన్ని టార్గెట్ చేసిన దొంగలు.. అమ్మవారి గర్బగుడి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఉదయం సుప్రభాత సేవ పూజకార్యక్రమాలు నిర్వహించేందుకు వచ్చిన అమ్మవారి ప్రదాన అర్చకుడు శ్రీనివాస్ ఆలయ తాళాలు పగలగొట్టి ఉన్నట్టు గుర్తించాడు. వెంటనే ఆలయ భద్రత సిబ్బందికి సమాచారం అందించారు. ఆలయ భద్రత సిబ్బంచి ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆలయ పూజారి చేత ఆలయ తలుపులు తెరిపించారు. అమ్మవారికి అలంకరించిన వెండి కిరీటంతో పాటు హుండీ అపహరించినట్టు పోలీసులు గుర్తించారు. భారీ భద్రత వలయాన్ని చేధించి దొంగలు ఎలా ఆలయంలోకి ఎంట్రీ ఇచ్చారన్నది సంచలనంగా మారింది.
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ప్రదాన ఆలయం మొదటి అంతస్తులో పూజలందుకుంటున్న మహాకాళి ఆలయంలో ఈ భారీ చోరీ చోటు చేసుకుంది. అమ్మవారి ఆలయం సమీపంలోని సీసీ కెమెరాలకు వస్త్రాలు కప్పి దుండగులు చోరీ కి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. దుండగులు ఆలయంలోకి ఎలా చొరబడ్డారు ఎన్ని గంటల సమయంలో చోరీకి పాల్పడ్డారు అన్నది విచారణలో తేలాల్సి ఉంది.
అర్థరాత్రి ఆరుగురు హోంగార్డ్ లు డ్యూటీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మహాకాళి ఆలయానికి వెళ్లే అన్ని ప్రధాన ద్వారాలను అర్థరాత్రి 12 గంటలకు ముందే మూసి వేసినట్టు సమాచారం.. ఉదయం 4 గంటల ప్రాంతంలో ఆలయ ప్రధాన ద్వారాలు తెరుచుకున్నాయి. ఉదయం 5 గంటల ప్రాంతంలో మహాకాళి అమ్మవారికి అభిషేకం చేసేందుకు వచ్చిన ప్రధాన పూజారి శ్రీనివాస్ అమ్మవారి గర్బగుడి తాళాలు పగల కొట్టినట్టు గుర్తించారు.
చోరీకి పాల్పడ్డ దుండగులు వేద వ్యాస గుహా మార్గంలో పరారైనట్టు సమాచారం.. చోరీకి పాల్పడ్డ హుండిని వేద వ్యాస గుట్ట పైన పడేసి పరారైనట్టు సమాచారం.. పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలోనే హుండీని పడేసి పరారవడం సంచలనంగా మారింది. మహాకాళి అమ్మవారి ప్రదాన పూజరి శ్రీను ఇచ్చిన వివరాలతో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. సీసీ పుటేజ్ ఆదారంగా ఇద్దరు దుండగులు అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో వ్యాస మహర్షి ఆలయ వెనుక వైపు నుండి ఆలయంలోకి చొరబడినట్టు గుర్తించారు పోలీసులు.. కాగా.. ఈ ఘటన సంచలనంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..