AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drone Survey: గ్రామాల్లో చక్కర్లు కొడుతున్న బుల్లి విమానాలు.. ఆశ్చర్యంగా తిలకిస్తున్న రైతులు!

సంగారెడ్డి జిల్లాలో బుల్లి విమానాలు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఉన్న భూ సమస్యలను తీర్చబోతున్నాయి. ఇంతకీ బుల్లి విమానాల కథ ఏంటీ..? ఇవి ఎందుకు గ్రామాల్లో అంతలా తిరుగుతున్నాయి, అనే విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

Drone Survey:  గ్రామాల్లో చక్కర్లు కొడుతున్న బుల్లి విమానాలు.. ఆశ్చర్యంగా తిలకిస్తున్న రైతులు!
Drone Survey
P Shivteja
| Edited By: |

Updated on: Jun 19, 2025 | 5:40 PM

Share

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని భూ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు భూభారతి అనే పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగానే ఇప్పుడు రాష్ట్రంలోనే భూ సమస్యలు తీర్చడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో భూముల కొలతలను నిర్ధారించడానికి డ్రోన్లతో భూ సర్వే చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మొదటగా రాష్ట్రంలోని ఓ ఐదుగ్రామాలను ప్రభుత్వం పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకొని భూ సర్వేలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఆయా గ్రామాల్లో భూ సర్వే నిర్వహించే బాధ్యతలను ఓ సర్వే ఏజెన్సీకి అప్పగించింది.

ఇక ఇందులో భాగంగానే ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే ఏజెన్సీలు డ్రోన్లతో భూ సర్వే జరపడం స్టార్ట్ చేశారు. అచ్చం విమానం ఆకారంలో ఉన్న ఈ ఆధునిక డ్రోన్లు.. పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసి గ్రామాల్లో ఒకటైన సంగారెడ్డి జిల్లా షాహెద్ నగర్‌లో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. ఇలా డ్రోన్లతో సర్వే చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి కావడంతో రైతులు ఈ సర్వేను ఆసక్తిగా తిలకిస్తున్నారు. ప్రస్తుతం డ్రోన్లతో జరుపుతున్న ఈ సర్వే సక్సెస్ అయితే.. ఇకపై రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ ఇలాంటి విమానపు ఆకారంలోని డ్రోన్లతోనే భూముల కొలతలు తేల్చనున్నారు అధికారులు.

అయితే సాధారణ డ్రోన్ల కన్నా ఈ ఎరోప్లేన్ డ్రోన్లతో భూముల కొలతల్లో ఖచ్చితత్వం ఉంటుందని చెబుతున్నారు అధికారులు. ప్రస్తుతం షాహెద్ నగర్ లో 21 సర్వే నంబర్లలో 574 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ సర్వే నెంబర్‌లో 279 మంది రైతులకు పాస్ బుక్కుల ఉన్నాయి. ముందుగా గ్రామానికి హద్దులు నిర్ణయించి. గ్రామ బౌండరీలు తేల్చాక సర్వే నంబర్ల వారీగా భూములను కొలిచి మ్యాపులు తయారు చేయనున్నారు అధికారులు. ప్రస్తుతం గ్రామాల శివారు ఆధారంగా అక్కడ పాయింట్లు అమర్చి డ్రోన్లతో కొలతలు వేస్తున్నారు అధికారులు. ఈ డ్రోన్లతో ఒకే రోజు 2 వేల ఎకరాల భూముల వరకు సర్వే చేయొచ్చు అని అధికారులు, సర్వే ఏజెన్సీ వాళ్ళు చెబుతున్నారు.

వీడియో చూడండి..

ఈ డ్రోన్ సర్వేలో ఖచ్చితత్వం ఉందా.. లేదా అని నిర్ధారించు కోవడానికి డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్‌లో మరో సర్వే చేస్తున్నారు. అంటే మొత్తం రెండు రకాల సర్వేలను చేసిన తర్వాత భూ హద్దులను నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలోని సర్వేయర్లు కూడా ఇదే విధానాన్ని పాటిస్తున్నారు. రెండు రకాల సర్వేలో తేడాలు ఉన్నాయా లేక రెండింటిలోనూ ఒకే రకమైన కొలతలు వచ్చాయా? అని తేల్చిన తర్వాతనే మ్యాపులు సిద్ధం చేస్తారు అధికారులు. అయితే నిజాం రాజుల కాలంలో గొలుసులతో భూముల కొలతలు వేసి ప్రతి గ్రామానికి టీపన్ నక్షా తయారు చేశారు నాటి అధికారులు. ఈ టీపన్ నక్షాలోని సర్వే నంబర్ల ఆధారంగానే భూముల విస్తీర్ణం, గ్రామాల్లోని రహదారులు, బాటలు సైతం ఉంటాయి. గడిచిన 75 ఏళ్లుగా భూములసర్వేకు టిప్పన్ నక్షానే ప్రమాణికంగా ఉండగా.. ఈ తాజా సర్వేతో ప్రతి గ్రామానికి డిజటల్ మ్యాపులు సిద్ధం చేయనున్నారు అధికారులు.

తాజాగా వచ్చిన ఈ డ్రోన్‌ల డిజిటల్‌ సర్వేతో ఇప్పటిదాకా భూములకు ఆధారంగా ఉన్న టీపన్ నక్షా కథ కంచికి చేరనుందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టి ఈ డ్రోన్ల సర్వే సక్సెస్‌ అయితే..రాష్ట్రమంతా ఇదే సర్వేని అమలు చేయనున్నారు అధికారులు. అప్పుడు టీపన్ నక్షాతో పని ఉండదని సీనియర్ సర్వేయర్లు అభిప్రాయపడుతున్నారు. గతంలో భూములు కొలవాలి అంటే గొలుసుల ద్వారా చాలా ఇబ్బంది అయ్యేదని, అంతే కాకుండా ఈ కొతల వల్ల గొడవలు కూడా అయ్యేవని.. ఇప్పుడు ఆ బాధలు ఏమి లేకుండా డ్రోన్స్‌తో కొలతలు త్వరగా పూర్తి చేసుకొవచ్చు అంటున్నారు రైతులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శ్రీవారి దర్శనం పేరిట బురిడీ.. ఎట్టకేలకు కేటుగాళ్లు అరెస్ట్
శ్రీవారి దర్శనం పేరిట బురిడీ.. ఎట్టకేలకు కేటుగాళ్లు అరెస్ట్
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఎవరికి ప్రమాదం
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఎవరికి ప్రమాదం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారం
ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రోహిత్ శర్మ గాయంపై వీడిన ఉత్కంఠ
ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రోహిత్ శర్మ గాయంపై వీడిన ఉత్కంఠ
వేగంగా తినేవారిలో ఆ సమస్య.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
వేగంగా తినేవారిలో ఆ సమస్య.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
స్వర్ణ కమలం టైటిల్ వెనుక అసలు అర్థం ఇదే.. సిరివెన్నెల కామెంట్స్..
స్వర్ణ కమలం టైటిల్ వెనుక అసలు అర్థం ఇదే.. సిరివెన్నెల కామెంట్స్..
ఇల్లు లేదా ఇంటి స్థలం తీసుకునేటప్పుడు ఇది తప్పక తెలుసుకోండి..
ఇల్లు లేదా ఇంటి స్థలం తీసుకునేటప్పుడు ఇది తప్పక తెలుసుకోండి..
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
చంద్ర బలంతో ఆ రాశుల వారికి విజయాలు పక్కా..!

విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..