తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి వెయ్యి కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. కేవలం నెల వ్యవధిలోనే ఈ ఆదాయం వచ్చింది. అది కూడా ఒక్క శాఖ నుంచే. అవును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి స్థిరాస్తులు ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్ల ద్వారా జనవరి నెలలో రూ.930 కోట్లు సమకూరగా.. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.60.75 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో దాదాపు రూ.600 కోట్ల వరకు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో నుంచే సమకూరినట్లు గణాంకాలు చెప్తున్నాయి. వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి రికార్డు సంఖ్యలో 1,96,225 దస్తావేజులు రిజిస్ట్రేషన్ జరిగాయి. వ్యవసాయభూముల దస్తావేజులు 48 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా నెలకు సగటున గరిష్ఠంగా రూ.600 కోట్ల నుంచి రూ.650 కోట్లు ఆదాయం వస్తోంది. లక్ష నుంచి 1.20లక్షల వరకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. అయితే గత రెండు, మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం, కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం తిరిగి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించడంతో జనవరి నెలలో అత్యధిక ఆదాయం సమకూరింది. కాగా.. 2019 మార్చిలో అత్యధికంగా రూ. 750 కోట్ల రాబడి వచ్చింది. ప్రస్తుత ఫిబ్రవరి, రానున్న మార్చి నెలలో సైతం అత్యధిక రిజిస్ట్రేషన్లు అయ్యే అవకాశాలున్నాయని అధికారులు తెలుపుతున్నారు.
Also Read: