Telangana: ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.3వేల కోట్లు విడుదల..

|

Mar 06, 2024 | 6:41 AM

Indiramma Housing Scheme: తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టిసారించింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం, రూ.500 లకు గ్యాస్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ లాంటి పథకాలను ప్రారంభించింది. తాజాగా.. తెలంగాణ పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై దృష్టిసారించింది.

Telangana: ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.3వేల కోట్లు విడుదల..
Revanth Reddy
Follow us on

Indiramma Housing Scheme: తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టిసారించింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం, రూ.500 లకు గ్యాస్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ లాంటి పథకాలను ప్రారంభించింది. తాజాగా.. తెలంగాణ పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై దృష్టిసారించింది. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 11న ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా నిధులను కూడా కేటాయించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధింది హడ్కో మంగళవారం రూ.3 వేల కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 95,235 ఇళ్లు మంజూరు చేసింది. ఈ ఇళ్ల నిర్మాణం కోసం హౌజింగ్‌ బోర్డు రుణాన్ని వినియోగించనుంది. అంతకుముందు హౌజింగ్‌ బోర్డుకు రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో 57,141, పట్టణాల్లో 38,094 ఇళ్లు నిర్మించనున్నారు.

ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. మార్చి 11న ప్రభుత్వం ఇందిరమ్మ పథకం ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ మొదట ప్రాధాన్యమివ్వాలని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేయాలన్నారు. అందుకు అనుగుణంగా విధి విధానాలను రూపొందించాలని.. ప్రజా పాలనలో నమోదు చేసుకున్న అర్హులందరికీ ముందుగా ప్రాధాన్యమివ్వాలని సూచించారు.

అసలైన లబ్ధిదారులకు ఇళ్లు అందేలా పారదర్శకంగా పథకాన్ని వర్తింపజేయాలని సూచించారు. కాగా.. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇంటి స్థలం ఉన్నవారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందిస్తారు. వీటిని దశల వారీగా నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..