ఒకే కాన్పులో16 పిల్లలకు జన్మనిచ్చిన శునకం

నాగర్ కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండల పరిధిలోని పసుపుల గ్రామంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో పెంచుకుంటున్న శునకం ఒకే కాన్పులో 16 పిల్లలకు జన్మనిచ్చింది. అయితే శునకం ఇన్ని పిల్లలకు జన్మనివ్వడం అరుదైన సంఘటనగా స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా శునకం మొదటి కాన్పులో 4పిల్లలు, రెండోవసారి 8పిల్లలకు, మూడోసారి 8పిల్లలకు, నాలుగోసారి 16 పిల్లలకు జన్మనిచ్చిందని యజమాని తెలిపారు. మొత్తంగా రెండేళ్లలో నాలుగుసార్లు కలిపి 36 పిల్లలకు […]

ఒకే కాన్పులో16 పిల్లలకు జన్మనిచ్చిన శునకం

Edited By:

Updated on: Apr 02, 2019 | 1:29 PM

నాగర్ కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండల పరిధిలోని పసుపుల గ్రామంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో పెంచుకుంటున్న శునకం ఒకే కాన్పులో 16 పిల్లలకు జన్మనిచ్చింది. అయితే శునకం ఇన్ని పిల్లలకు జన్మనివ్వడం అరుదైన సంఘటనగా స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా శునకం మొదటి కాన్పులో 4పిల్లలు, రెండోవసారి 8పిల్లలకు, మూడోసారి 8పిల్లలకు, నాలుగోసారి 16 పిల్లలకు జన్మనిచ్చిందని యజమాని తెలిపారు. మొత్తంగా రెండేళ్లలో నాలుగుసార్లు కలిపి 36 పిల్లలకు జన్మనిచ్చిందని యజమాని వెల్లడించారు.