తెలంగాణలో రాజకీయాల రచ్చ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పార్టీకి పురుడు పోశారు. తనదైన శైలితో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అందుకు కొత్త పార్టీని ప్రకటించారు. దసరా రోజున బీఆర్‌ఎస్ పార్టీగా ప్రకటిస్తూ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కొత్త పార్టీపై పలువురు రాజకీయ నేతలు, ఇతరులు స్పందిస్తున్నారు. అలాగే టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. ఆయన ఏదీ మాట్లాడిన సంచలనమే. ఎప్పుడు ట్విట్టర్‌లో ఏదో ఒక అంశంపై ట్విట్ చేస్తుంటారు వర్మ. ట్విట్టర్‌లో ఎక్కువగా స్పందించి ఆయన.. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన కేసీఆర్‌ను తొలి ఆదిపురుష్ అయ్యాడంటూ ట్విట్ చేశారు. జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న కేసీఆర్‌కు స్వాగతం పలికారు రాంగోపాల్ వర్మ. అయితే వర్మ కేసీఆర్‌ను ఆదిపురుష్‌గా అభివర్ణించడంతో కొందరు నెటిజన్లు పొడుగుడున్నారా…? లేక విమర్శిస్తున్నారా..? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.
By Making TRS into BRS , KCR became the AdiPurush (1stMan) to do it ..Welcome to NATIONAL POLITICS ?
— Ram Gopal Varma (@RGVzoomin) October 5, 2022
కాగా, టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మారుస్తూ చేసిన తీర్మానాన్ని పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు బి. వినోద్‌కుమార్ బృందం ఢిల్లీకి తీసుకెళ్లనుంది. కేసీఆర్ చార్టర్డ్ విమానంలో ఈ సాయంత్రమే.. వీరు ఢిల్లీ వెళ్తారు.. గురువారం నాడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ తీర్మానాన్ని సమర్పిస్తారు. ఈసీఐ దీనిని పరిశీలించి ఆమోదం తెలపగానే బీఆర్‌ఎస్ ప్రస్థానం మొదలవుతుంది. జాతీయ పార్టీగా మారిన అనంతరం అఖిల భారత స్థాయిలో కొన్ని అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా తొలుత కిసాన్ సంఘ్‌ను ఏర్పాటు చేయనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి