AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇన్‌ఫార్మర్ నెపంతో 30 ఏళ్ల క్రితం అతని తండ్రిని చంపిన అన్నలు.. కట్ చేస్తే.. ఇప్పుడు

సినిమాల్లో చూసే ప్రతీకార కథలా ఉంది ఈ ఘటన. రాజన్న సిరిసిల్లకు చెందిన జక్కుల అంజయ్యను “ఇన్‌ఫార్మర్” అని భావించిన నక్సలైట్లు ముప్పై ఏళ్ల క్రితం హత్య చేశారు. ఆ సమయంలో చిన్నవయసున్న అతని కుమారుడు సంతోష్, తండ్రి హత్య చేయడాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆ తర్వాత...

Telangana: ఇన్‌ఫార్మర్ నెపంతో 30 ఏళ్ల క్రితం అతని తండ్రిని చంపిన అన్నలు.. కట్ చేస్తే.. ఇప్పుడు
Siddanna - Santosh
G Sampath Kumar
| Edited By: Ram Naramaneni|

Updated on: Nov 28, 2025 | 4:29 PM

Share

ఈ రియల్ క్రైమ్ కహాని సినిమా స్టోరీకి ఏ మాత్రం తక్కువ కాదు.  రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లికి చెందిన జక్కుల అంజయ్య అప్పటి పరిస్థితుల్లో “ఇన్‌ఫార్మర్” అన్న ముద్రతో నక్సలైట్ల చేతిలో చనిపోయాడు. అంజయ్య కుమారుడు సంతోష్ ఆ సమయంలో చిన్నవయసులో ఉన్నాడు. తన తండ్రి హత్యపై బాల్యంలోనే రగిలిపోయాడు. తన తండ్రిని చంపినవాడిని ఏదో ఒక రోజు అంతం చేస్తానని ప్రతిన బూనాడు. అయితే.. తండ్రిని హత్య చేసిన వాళ్లు..మావోయిస్టులు కావడంతో.. అడవుల్లో ఉండే వారిని పట్టుకోవడం కష్టమని భావించాడు.

అయితే తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన మాజీ నక్సలైట్ సిద్ధన్న అలియాస్ బల్లెపు నర్సయ్య ప్రస్తుతం జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. తన ఉద్యమంలో పని చేసినప్పటి విషయాలను ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే.. తాను నక్సలైట్‌గా ఉన్నప్పుడు కోవర్టులను, ఇన్ఫార్మర్లను హత్య చేసినట్లు వెల్లడించాడు. అంజయ్యను కూడా తానే హత్య చేసినట్లు చెప్పాడు. ఈ ఇంటర్వ్యూని చూసిన అంజయ్య కొడుకు సంతోష్ ..కోపంతో రగిలి పోయాడు. సిద్దన్నను హత్య చేసి.. తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు.  ఇంటర్వ్యూ చేద్దామని సిద్దన్నను ఆహ్వానించాడు సంతోష్. వేములవాడ పరిధిలోని అగ్రహారం గుట్టల్లోకి తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రదేశంలో సిద్ధన్న ముఖం, తలపై బండరాళ్లతో కొట్టాడు. అతను చనిపోయిన తరువాత..అక్కడి నుంచి నేరుగా జగిత్యాల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ముప్పై ఏళ్ల క్రితం నా తండ్రిని చంపాడు. ఈరోజు నేను అతన్ని చంపాను అని పోలీసులకు చెప్పాడు.

అలా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూ దారుణ హత్యకు దారితీసింది. పోలీసులు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యలో సంతోష్ ఒక్కరే ఉన్నారా.. ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
"నీ బుర్ర వాడకు, నేను చెప్పింది చేయి..": కేఎల్ రాహుల్ ఫైర్
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
తెలంగాణలో వచ్చే జూన్‌ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
తెలంగాణలో వచ్చే జూన్‌ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
నెంబర్ టైప్ చేస్తే చాలు ..మీ లైవ్ లొకేషన్ వస్తుంది.. డేంజర్..
నెంబర్ టైప్ చేస్తే చాలు ..మీ లైవ్ లొకేషన్ వస్తుంది.. డేంజర్..
జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకు..! రూ.64 వేల కోట్ల టార్గెట్‌!
అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకు..! రూ.64 వేల కోట్ల టార్గెట్‌!
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
అమెరికా నుంచి వేలాది భారతీయుల బహిష్కరణ.. లెక్కతేల్చిన కేంద్రం
అమెరికా నుంచి వేలాది భారతీయుల బహిష్కరణ.. లెక్కతేల్చిన కేంద్రం