Rain Alert: ఏపీని బెదిరిస్తోన్న వరుణుడు.. ఈ జిల్లాలకు పిడుగులతో వర్షాలు.. తెలంగాణలో ఇలా

మొంథా తుఫాన్ అనంతరం తెలుగు రాష్ట్రాలకు కాస్త ఉపశమనం దక్కినా.. మళ్లీ వర్షాలు కురవనున్నాయి. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. ఆ వివరాలు ఏంటో.? ఇప్పుడు ఈ వార్తలో చూసేద్దాం. ఓ సారి లుక్కేయండి మరి.

Rain Alert: ఏపీని బెదిరిస్తోన్న వరుణుడు.. ఈ జిల్లాలకు పిడుగులతో వర్షాలు.. తెలంగాణలో ఇలా
Weather

Updated on: Nov 05, 2025 | 8:07 AM

కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తనం.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 900 మీటర్ల ఎత్తులో ఉందంది. దీని ప్రభావంతో ఇవాళ(బుధవారం) ఏపీలోని 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయంది. కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు.. కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందంది.

ఇక హైదరాబాద్‌లోనూ తేలికపాటి వర్షం కురవనుండగా.. వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, నల్గొండ, వనపర్తి, గద్వాల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ఇవాళ మధ్యాహ్నం నుంచి వర్షాలు కురవనున్నాయని తెలిపింది. అలాగే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో, హైదరాబాద్‌లో గురువారం నుంచి వర్షాలు ముగిసే అవకాశం ఉందని వాతావరణ శాఖా నిపుణులు అంచనా వేస్తున్నారు.

SCATTERED THUNDERSTORMS ahead in Vikarabad, Rangareddy, Mahabubnagar, Nagarkurnool, Nalgonda, Wanaparthy, Gadwal, Bhadradri – Kothagudem, Khammam, Mahabubabad, Mulugu during afternoon to night