Qnet Victims: సైబర్ పీఎస్ ముందు క్యూనెట్ బాధితుల ఆందోళన.. మోసపోయిన తమలో ఏ ఒక్కరికీ న్యాయం చెయ్యలేదంటూ..

|

May 19, 2023 | 5:25 AM

Q NET Victims: క్యూనెట్‌ బాధితులు మరోసారి రోడెక్కారు. అగ్నిప్రమాదం జరిగి రెండు నెలలు అవుతున్నా.. తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేసే వరకు తమ పోరాటం చేస్తామన్నారు క్యూ నెట్ బాధితులు..

Qnet Victims: సైబర్ పీఎస్ ముందు క్యూనెట్ బాధితుల ఆందోళన.. మోసపోయిన తమలో ఏ ఒక్కరికీ న్యాయం చెయ్యలేదంటూ..
Qnet Victims' Protestings
Follow us on

Hyderabad: తమకు న్యాయం చెయ్యాలంటూ క్యూనెట్ భాదితులు గురువారం బషీర్ బాగ్ లోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆందోళన చేశారు. దండిగా లాభాలు ఇస్తామని సంస్థ నిర్వాహకులు ఒక్కొక్కరి నుంచి 2 నుంచి 5 లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పారు. తమలో ఆరుగురు సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని క్యూనెట్ ఆఫీస్‌లో పనిచేస్తూ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆరోపించారు. ఇక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ చుట్టూ గత రెండు నెలలుగా తిరుగుతున్న ఎవరు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు క్యూనెట్‌కు చెందిన 137 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు చెప్పారన్నారు. అయితే మోసపోయిన తమలో ఏ ఒక్కరికీ న్యాయం చెయ్యలేదని బాధితులు చెప్పారు. ఇంకా అరెస్ట్ అయిన నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చారన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని 300 మంది బాధితులకు న్యాయం చెయ్యాలని కోరారు.

కాగా, గతంలో క్యూనెట్‌ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ భరోసా ఇచ్చారు. క్యూనెట్‌ సంస్థ ఉద్యోగావకాశాల పేరిట డబ్బులు వసూలుచేసిందని క్యూనెట్‌ బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో క్యూనెట్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవడంతోపాటు బాధితులు చెల్లించిన సొమ్ములను తిరిగి ఇప్పించేలా చూస్తామని హామీ ఇచ్చారు. అయితే 2 నెలలు గడుస్తున్నా తమకు న్యాయం చేయలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం క్యూ నెట్ బాధితులకు న్యాయం చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..