Telangana: భగవద్గీతపై బండి కామెంట్స్.. ఫైర్ అవుతున్న ప్రముఖులు.. మద్దతు తెలిపిన వీహెచ్‌పీ..
Telangana: భగవద్గీతపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్లపై పెను దుమారం చెలరేగుతోంది. తాజాగా బండి వ్యాఖ్యలపై ప్రొఫెసర్ హరగోపాల్ సహా పలువురు..
Telangana: భగవద్గీతపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్లపై పెను దుమారం చెలరేగుతోంది. తాజాగా బండి వ్యాఖ్యలపై ప్రొఫెసర్ హరగోపాల్ సహా పలువురు ప్రముఖులు స్పందించారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ప్రొఫెసర్ హరగోపాల్.. భగవద్గీతపై బండి కామెంట్లు కొత్త వివాదానికి తెరదీసేలా ఉన్నాయన్నారు. ఎవరైనా చనిపోయినప్పుడు భగవద్గీత పెట్టకూడదన్న నియమం ఎక్కడా లేదన్నారు హరగోపాల్. బండి సంజయ్ అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని విచారం వ్యక్తం చేశారు. ఆయన మాటల వెనుక ఉద్దేశ్యం ఏంటో అర్థంకావడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు కూడా బండి సంజయ్ కామెంట్స్‌పై స్పందించారు. కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటూ నిప్పులు చెరిగారు. మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టేందుకే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని వీహెచ్ ఫైర్ అయ్యారు. ఇదిలాఉంటే.. భగవద్గీతపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు వీహెచ్‌పీ నేతలు మద్ధతు ప్రకటించారు. వ్యక్తి చనిపోయినప్పుడు భగవద్గీతను ప్లే చేయడాన్ని తప్పుపట్టారు వీహెచ్‌పీ నేత శశిధర్. ఇలాంటి జరుగకుండా, ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..