Priyanka Gandhi Telangana Visit Highlights: తెలంగాణ నేల కాదు.. తల్లి.. యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ
Priyanka Gandhi Public meet in Telangana: కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు.. తెలంగాణలోని నిరుద్యోగులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా.. కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ పేరుతో యువ సంఘర్షణ సభను ఏర్పాటు చేసింది. సరూర్ నగర్ లో జరిగే యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగించనున్నారు.
Priyanka Gandhi Public meet in Telangana Highlights: కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు.. తెలంగాణలోని నిరుద్యోగులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా.. కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ పేరుతో యువ సంఘర్షణ సభను ఏర్పాటు చేసింది. సరూర్ నగర్ లో జరిగే యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభలో ప్రియాంక కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామనే హామీతోపాటూ.. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇచ్చే అంశాన్ని కూగా ప్రసావించనున్నారు. తొలిసారిగా ప్రియాంక గాంధీ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు జనసమీకరణ కూడా భారీగా ఉండేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న ప్రియాంక గాంధీ.. హైదరాబాద్‌లో తొలి రాజకీయ సభకు హాజరవుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
LIVE NEWS & UPDATES
-
తెలంగాణలో ప్రతీ వ్యక్తిపై అప్పు
ఏ ప్రభుత్వం వచ్చినా ఆకాంక్షలు పూర్తిచేస్తుందని అనుకున్నామని.. తెలంగాణలో ప్రతీ వ్యక్తిపై వేలాది రూపాయల అప్పు ఉందని ప్రియాంక గాంధీ తెలిపారు.
-
నీళ్లు, నిధులు, నియామకాల కోసం..
నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడిందని.. అమరవీరుల ఆకాంక్షలతోనే తెలంగాణ రాష్ట్రం కల సాకారమైందని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఏ ఒక్కరో పోరాడితే తెలంగాణ రాలేదని పేర్కొన్నారు. త్యాగం అంటే ఏంటో తన కుటుంబానికి కూడా తెలుసని ప్రియాంక పేర్కొన్నారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేయడంతో సోనియా ఎంతో ఆలోచన చేసి.. స్వప్పాన్ని సాకారం చేశారని తెలిపారు.
-
-
తెలంగాణ మీకు నేల కాదు.. తల్లి.. ప్రియాంక గాంధీ
మీరు తెలంగాణను తల్లిలా భావిస్తారని.. తెలంగాణ మీకు నేల కాదు.. తల్లి అంటూ ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. తెలంగాణ కోసం కలలు కన్నారని.. అమరవీరుల ఆకాంక్షలతో తెలంగాణ ఏర్పడిందని ప్రియాంక పేర్కొన్నారు. ఈ నేల కోసం వందలాది మంది ప్రాణ త్యాగం చేశారని గుర్తుచేశారు.
-
జై బోలో తెలంగాణ.. ప్రియాంక గాంధీ
జై బోలో తెలంగాణ అంటూ ప్రియాంక గాంధీ ప్రసంగాన్ని మొదలుపెట్టారు..
-
ఫీజు రియంబర్స్‌మెంట్..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ ఇస్తామని.. పాత బకాయిలను కూడా విడుదల చేస్తామని రేవంత్ తెలిపారు. కొన్ని యూనివర్సీటిలను ఇంటిగ్రెటెడ్ యూనివర్సీటిలుగా మారుస్తామని తెలిపారు.
-
-
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగేలా
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ తెలిపారు. నిరుద్యోగులకు 10లక్షల వరకు వడ్డీ లేని రుణాలను అందిస్తామని..ప్రవేట్ సంస్థల్లో 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా చట్టం తేస్తామన్నారు.
-
2 లక్షల ఉద్యోగాల భర్తీ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బ్యాక్ లాగ్ పోస్టులను సైతం భర్తీచేస్తామన్నారు. ప్రతీ సంవత్సరం ఉద్యోగ కాలేండర్ కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. నాలుగు వేల భృతి ఇస్తామని, యూసీఎస్సీ తరహాలో బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపారు.
-
అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు
అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపునిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాల్లో ఒకరి ఉద్యోగం ఇస్తామని పేర్కొన్నారు. ఉద్యమకారులపై కేసులను ఎత్తి వేయాలని.. వారికి గౌరవం ఇస్తామని పేర్కొన్నారు.
-
హైదరాబాద్ యూత్ డిక్లరేషన్
ఐదు అంశాలతో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ను ప్రకటించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
-
ఉస్మానియా, కాకతీయ యూనివర్సీటీలు తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలు.. రేవంత్ రెడ్డి..
ఉస్మానియా, కాకతీయ యూనివర్సీటీలు తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలని.. ఉద్యమానికి, సామాజిక చైతన్యానికి వేదికలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
-
అన్ని వర్గాల సంక్షేమం కోసం..
అన్ని వర్గాల సంక్షేమం కోసం సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని.. కానీ వారిని పట్టించుకోవడం లేదని టీపీసీసీ ఇన్ఛార్జ్ మాణిక్ రావ్ థాక్రే పేర్కొన్నారు.
-
పోచంపల్లి చీరను బహూకరించిన భట్టి విక్రమార్క
ప్రసంగం అనంతరం భట్టి విక్రమార్క పోచంపల్లి చీరను ప్రియాంక గాంధీకి బహూకరించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను, పోచంపల్లి ప్రత్యేకతను ప్రియాంకకు వివరించారు.
-
ఇందిరమ్మ రాజ్యం కోసం పోరాడాలి..
తల్లి లాగా ఆలోచన చేసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యం కోసం మరోసారి పోరాడాలని భట్టి పిలుపునిచ్చారు.
-
నిరుద్యోగులకు భరోసా ఇవ్వడానికి ప్రియాంక వచ్చారు.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
తెలంగాణ యువతకు భరోసా ఇవ్వడానికి ప్రియాంక గాంధీ హైదరాబాద్ వచ్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తన పాదయాత్రలో అనేక సమస్యలు తెలుసుకున్నానని పేర్కొన్నారు. తెలంగాణలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు నిరాశలో ఉన్నారని తెలిపారు.
-
బీమా సాయం చెక్కులు అందజేసిన ప్రియాంక గాంధీ
సరూర్ నగర్ సభా ప్రాంగాణానికి చేరుకున్న ప్రియాంకగాంధీకి కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ వివిధ ప్రమాదాల్లో చనిపోయిన కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలకు బీమా సాయం అందించారు.
-
సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రియాంక గాంధీ
ప్రియాంక గాంధీ సరూర్ నగర్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మరికాసేట్లో ప్రసంగించనున్నారు.
-
మరికాసేపట్లో సభా ప్రాంగణానికి ప్రియాంక గాంధీ
ఎల్బీనగర్ నుంచి సరూర్ నగర్ వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహిాస్తున్నారు. మరికాసేపట్లో ప్రియాంక గాంధీ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు.
-
భారీ జనసమీకరణ..
ప్రియాంక గాంధీ ప్రసంగం 20 నుంచి 25 నిమిషాలపాటు ఉంటుంది. సభ ముగిసిన తర్వాత.. ఢిల్లీకి వెళ్లనున్నారు ప్రియాంక గాంధీ. ప్రియాంకగాంధీకి తెలంగాణలో ఇది తొలి రాజకీయ సభ కావడంతో.. విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు రోజులుగా జన సమీకరణ, ఏర్పాట్లపై భారీగా సమీక్షలు నిర్వహించారు.
-
బీమా చెక్కులు అందించనున్న ప్రియాంక..
సరూర్ నగర్ సభలో ప్రియాంక గాంధీ ఇటీవల కాలంలో వివిధ ప్రమాదాల్లో చనిపోయిన కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలకు బీమా సాయం అందించనున్నారు.
-
హాజరైన గద్దర్..
సరూర్‌నగర్ కాంగ్రెస్ నిరుద్యోగ యువ సంఘర్షణ సభకు గద్దర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాకారులతో కలిసి పాటలు పాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలో కొత్త పార్టీ పెడతానని పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
-
ప్రతిష్ఠాత్మకంగా కాంగ్రెస్ నిరుద్యోగ యువ సంఘర్షణ సభ
నిరుద్యోగులు, విద్యార్థులు, యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందనే సందేశాన్ని ఈ సభ ద్వారా ఇవ్వనుంది కాంగ్రెస్. గతంలో వరంగల్‌లో నిర్వహించిన రైతు సభ తరహాలోనే దీన్ని కాంగ్రెస్ నిర్వహిస్తోంది. ప్రియాంక పర్యటనలో ఎల్.బీ.నగర్‌లో ఉన్న శ్రీకాంతాచారి విగ్రహాన్నికి పూలమాల వేయాలని భావించినా భద్రతా కారణాల రీత్యా పోలీసులు అనుమతి నిరాకరించారు.
-
కాంగ్రెస్ యువ సంఘర్షణ సభ..
బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రియాంక గాంధీ.. ఎల్బీనగర్ చౌరస్తాకు చేరుకోనున్నారు. అక్కడ శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళి అర్పిస్తారు. ఎల్బీనగర్ నుంచి సరూర్నగర్ స్టేడియం వరకు ర్యాలీగా సభ స్థలి వద్దకు చేరుకోనున్నారు.
-
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంక గాంధీ
ప్రియాంక గాంధీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. స్పెషల్ ఫ్లైట్లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రియాంకా గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు.
-
బేగంపేటకు చేరుకుని..
ప్రియాంకగాంధీ స్పెషల్ ఫ్లైట్లో బేగంపేటకు చేరుకుని.. బేగంపేట నుంచి ఎల్బీనగర్ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడ శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళి అర్పిస్తారు. ఎల్బీనగర్ నుంచి సరూర్నగర్ స్టేడియానికి చేరుకుంటారు. సరూర్నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ సంఘర్షణ సభలో ప్రసంగిస్తారు.
Published On - May 08,2023 4:02 PM