PM Modi: తెలంగాణకు నరేంద్ర మోదీ.. వందే భారత్ రైలును ప్రారంభించనున్న ప్రధాని.
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నారు. ఈ నెల 19వ తేదీన మోదీ తెలంగాణ పర్యటన ఖరారైనట్లు సమాచారం. తెలంగాణ టూర్‌లో భాగంగా ప్రధాని సికింద్రబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకణ పనులను ప్రారంభించనున్నారు. అనంతరం రైల్వేస్టేషన్‌లో మోదీ ప్రసగించనున్నారు. దీంతో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి..

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నారు. ఈ నెల 19వ తేదీన మోదీ తెలంగాణ పర్యటన ఖరారైనట్లు సమాచారం. తెలంగాణ టూర్‌లో భాగంగా ప్రధాని సికింద్రబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకణ పనులను ప్రారంభించనున్నారు. అనంతరం రైల్వేస్టేషన్‌లో మోదీ ప్రసగించనున్నారు. దీంతో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తొలి వందే భాతర్ రైలును మోదీ ప్రారంభించనున్నారు.
సికింద్రాబాద్- విజయవాడల మధ్య వందే భారత్ రైలు పరుగులు పెట్టనుంది. ఈ రైలును ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 19వ తేదీన హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. వీటితో పాటు ప్రధాని.. మరికొన్ని రైల్వే ప్రాజెక్టులకూ శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించేందుకు వీలుగా రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. కాజీపేటలో నిర్మించ తలపెట్టిన పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వ్యాగన్ వర్క్‌షాప్ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ పనులను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కొద్దిరోజుల క్రితమే ఖరారు చేసింది. ఆ పనులకు ప్రధాని మోదీ శంఖుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు సంబంధించి ఇటీవలే రూ. 700 కోట్ల పనులకు సంబంధించిన టెండర్లు ఖరారయ్యాయి. ఈ పనులకు కూడా మోదీ ప్రారంభించనున్నారు. అలాగే సికింద్రాబాద్-మహబూబ్ నగర్ రెండో లైన్‌ను కూడా ప్రధాని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో మరోసారి రాజకీయంగా ఆసక్తిక నెలకొంది. బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నెలకొన్న తరుణంలో మోదీ పర్యటన మరోసారి చర్చకు దారి తీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.




మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..
