President – VP Fight : ఎక్కడా కనని కొట్లాట, సాక్షాత్తూ పంచాయతీలోనే, ‘సర్పంచ్ – ఉప సర్పంచ్’ పిడిగుద్దులు, ముష్టి ఘాతాలు

President - Vice President Fight : గ్రామానికే తొలిపౌరుడు.. సాక్షాత్తూ సర్పంచ్.. పంచాయతీకి రెండో పెద్ద ఉపసర్పంచ్. ఎంతో హుందా అయిన పదవిలో ఉండి ఊర్లో ..

President - VP Fight : ఎక్కడా కనని కొట్లాట, సాక్షాత్తూ పంచాయతీలోనే, సర్పంచ్ - ఉప సర్పంచ్ పిడిగుద్దులు, ముష్టి ఘాతాలు
Panchayat President Vs Vp

Updated on: Mar 26, 2021 | 5:02 PM

President – Vice President Fight : గ్రామానికే తొలిపౌరుడు.. సాక్షాత్తూ సర్పంచ్.. పంచాయతీకి రెండో పెద్ద ఉపసర్పంచ్. ఎంతో హుందా అయిన పదవుల్లో ఉండి ఊర్లో వాళ్లకి పెద్దల్లా వ్యవహరించి, దిక్సూచీల్లా నిలవాల్సిన వారిద్దరూ చొక్కాలు చినిగేలా కొట్టుకున్నారు. ఆఫీస్ ఛాంబర్ లోనే పిడి గుద్దులు గుద్దుకున్నారు. కుర్చీలు విరిగిపోయేలా ముష్టిఘాతాలు కురింపించకున్నారు. బల్లలు తన్ని ఒకరిపై ఒకరు కిందా మీదా పడ్డారు.

పంచాయతీ ఆఫీస్ లో ఉన్న చిన్నాపెద్దా కల్పించుకుని విడదీసేంతవరకూ వారి పట్లు విడువలేదు. కనీవినీ ఎరుగని ఈ సీన్ కు మెదక్ జిల్లా వేదికైంది. కౌడిపల్లి మండలం ముట్రాజ్ పల్లి పంచాయతీలో ఒకరిపై, ఒకరు దాడిచేసుకున్నారు సర్పంచ్ – ఉపసర్పంచ్. డ్రైనేజీ బిల్లులు పెట్టే విషయంలో ఇద్దరి మధ్య నెలకొన్న వివాదం కాస్తా చినికి చినికి గాలివానలా మారి చివరికి ఉప్పెనలా ఉబికింది. సర్పంచ్ పంచాయతీ నిధులతో సొంత పనులు చేయించు కుంటున్నాడని మొదలైన గొడవ.. ఒకరిని, ఒకరు కొట్టుకుని పోలీసులకి ఫిర్యాదు చేసేంతవరకూ వెళ్లింది, కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగారు పోలీసులు. అదీ సంగతి.

Read also :  GMR Hyderabad Air Cargo : రవాణాలో కొత్త శకం, వ్యాక్సిన్ సరఫరాలో బ్లాక్‌చెయిన్ బేస్డ్ రియల్ టైమ్ ట్రాకింగ్‌ను తీసుకొచ్చిన GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో