AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది.. మంగళ శాసనాలు ఇచ్చిన చిన్న జీయర్ స్వామి

శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారు భారత రాష్ట్రపతి ద్రౌపతి మూర్ముకు స్వాగతం పలికారు. గిరిజన సంస్కృతి సంప్రదాయ పద్ధతిలో నృత్య కళాకారులు స్వాగతం తెలిపారు. 108 దివ్య దేశాల దర్శనం తర్వాత 216 రామానుజ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూసి అక్కడనుండి రామానుజన్ స్వర్ణ విగ్రహాన్ని దర్శనం చేసుకున్నారు. 

Hyderabad: సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది.. మంగళ శాసనాలు ఇచ్చిన చిన్న జీయర్ స్వామి
Droupadi Murmu In Hyderabad
Surya Kala
|

Updated on: Dec 29, 2022 | 8:18 PM

Share

భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ముచ్చింతల్ లోని శ్రీ రామానుజ సమాతమూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించుకున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఖ్యాతి గడించిన హైదరాబాద్ లోని ముచ్చింతల్ సమతా మూర్తి స్ఫూర్తి వద్ద శ్రీశ్రీశ్రీ రామానుజ చిన్న జీయర్ స్వామి రాష్ట్రపతికి సాంప్రదాయ పద్ధతిలోస్వాగతం పలికారు. ఆధ్యాత్మిక శోభన సంతరించుకున్న సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి భారత రాష్ట్రపతి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రత్యేక హెలికాప్టర్లో సాయంత్రం 5 గంటలకు ముచింతల్ లోని శ్రీరామ నగరంలోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రానికి చేరుకున్నారు. హెలిపాడ్ నుంచి నేరుగా ప్రత్యేక వాహనంలో సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారు భారత రాష్ట్రపతి ద్రౌపతి మూర్ముకు స్వాగతం పలికారు. గిరిజన సంస్కృతి సంప్రదాయ పద్ధతిలో నృత్య కళాకారులు స్వాగతం తెలిపారు. అనంతరం శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి రాష్ట్రపతిని వెంట తీసుకుని 108 దివ్యసాలు సందర్శిస్తూ ఆలయ విశేషాలు తెలియ చేశారు.

108 దివ్య దేశాల దర్శనం తర్వాత 216 రామానుజ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూసి అక్కడనుండి రామానుజన్ స్వర్ణ విగ్రహాన్ని దర్శనం చేసుకున్నారు.  అక్కడే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ రామానుజ స్వామి వారు మంగళ శాసనాలు ఇచ్చారు ….ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. మంగళ శాసనాలతో పాటు శ్రీ రామానుజ వారి ప్రత్యేక మెమొంటోను అందజేశారు. అనంతరం శ్రీ రామానుజ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎదురుగా ఏర్పాటుచేసిన డైనమిక్ ఫౌంటైన్ స్పెషల్ షో తిలకించారు.

ఇవి కూడా చదవండి

Reporter :Anil

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..