President Of India: ఈనెల 20న తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన.. ఈ ప్రాంతాలను సందర్శించనున్న ద్రౌపదీ ముర్ము..

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి, కంచి పట్టు చీరలకు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి కేరాఫ్ అడ్రస్‎గా నిలిచింది. పోచంపల్లి చేనేత కార్మికుల నైపుణ్యానికి ప్రతీక.. ఇక్కడి కంచి పట్టుచీరలు. చేనేత కార్మికుల సృజనాత్మకత, నూతన డిజైన్లతో చేనేత వస్త్రాల తయారీతో పర్యాటక ప్రాంతంగా మారింది. ఇక్కడ జరిగే సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు.

President Of India: ఈనెల 20న తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన.. ఈ ప్రాంతాలను సందర్శించనున్న ద్రౌపదీ ముర్ము..
President Draupadi Murmu Will Visit In Pochampally, Telangana On 20 December

Edited By:

Updated on: Dec 07, 2023 | 4:28 PM

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి, కంచి పట్టు చీరలకు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి కేరాఫ్ అడ్రస్‎గా నిలిచింది. పోచంపల్లి చేనేత కార్మికుల నైపుణ్యానికి ప్రతీక.. ఇక్కడి కంచి పట్టుచీరలు. చేనేత కార్మికుల సృజనాత్మకత, నూతన డిజైన్లతో చేనేత వస్త్రాల తయారీతో పర్యాటక ప్రాంతంగా మారింది. ఇక్కడ జరిగే సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు.

కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన యాదాద్రి జిల్లా పోచంపల్లిలో జరిగే థీమ్ పెవిలియన్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. ఇక్కడ చేనేత వస్త్రాల తయారీలో వివిధ అవార్డులు అందుకున్న చేనేత కార్మికులు, పద్మశ్రీ అవార్డులు పొందిన గజం గోవర్ధన్, గజం అంజయ్య, బాలయ్య, సంత్ కబీర్‎లతో ముఖాముఖి నిర్వహిస్తారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ సొసైటీతో పాటు ఇక్కడి షోరూంలను ఆమె సందర్శించనున్నారు. శీతకాలపు విడిది సెలవులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. ఇందులో భాగంగా పోచంపల్లిని సందర్శిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కోసం అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి