రహదారి లేని గ్రామంలో పురిటి నొప్పులతో గర్భిణి అవస్థలు.. మంచంపై మోసుకుంటూ తీసుకెళ్లాల్సిన దుస్థితి
బిడ్డకు జన్మనివ్వటం మహిళకు పునర్జన్మలాంటిది. అటువంటి పరిస్థితుల్లో పురిటి నొప్పులతో అల్లాడిపోతున్న ఓ గర్భిణీని హాస్పిటల్..
బిడ్డకు జన్మనివ్వటం మహిళకు పునర్జన్మలాంటిది. అటువంటి పరిస్థితుల్లో పురిటి నొప్పులతో అల్లాడిపోతున్న ఓ గర్భిణీని హాస్పిటల్ కు తరలించేందుకు మంచంపై మోసుకుంటూ తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో చోటు చేసుకుంది.
కొత్త మేడేపల్లి అటవీ ప్రాంతంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గిరిజన బిడ్డకు మానవత్వంతో సాయం అందించారు 108, ఐసిడిఎస్ సిబ్బంది. రహదారి లేని గ్రామంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణిని కిలోమీటరు మేర మంచంపై మోసుకుంటూ వెళ్లి 108 ఎక్కించి ఆస్పత్రికి తరలించారు.
ఆదివాసీ గిరిజన కుటుంబానికి చెందిన హేమ్లా నిర్మలకుమారి నిండు గర్భిణీ.. పురిటి నొప్పులు మొదలుకావటంతో…స్థానికుల సమాచారం మేరకు ఆరోగ్య సిబ్బంది ఐసిడిఎస్ సిబ్బంది కి సమాచారం అందించారు. వెంటనే గ్రామానికి చేరుకున్న సిబ్బంది ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరిస్థితి విషమించడంతో రహదారి సౌకర్యం లేక పోవటంతో…మంచంలోనే ఆమెను…కిలోమేటరు మేర మోసుకుంటూ వెళ్లి అంబులెన్స్ లో ఏన్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ కూడా వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. అక్కడ తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
రహదారి లేని ప్రాంతంలో గర్భిణీని మంచంపై మోసుకుంటూ సహాయం అందించిన 108, ఐసీడీఎస్ సిబ్బందిని గిరిజనులు ప్రత్యేకంగా అభినందించారు. అయితే, స్వాతంత్ర్య వచ్చి ఇన్ని ఏళ్లు గడుస్తున్నా, కనీస వైద్య సదుపాయాలు కూడా అందని గ్రామాలు..ప్రాంతాలు ఈనాటికీ ఉండటం దురదృష్టకరం.
మరిన్ని ఇక్కడ చదవండి :
South India Famous Temples : దక్షిణ భారతదేశంలోని అందమైన ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు వాటి.. విశిష్టత
Covid vaccine: క్షణాల్లోనే విషాదం.. కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న వ్యక్తి మృతి