ఆ విషయంలో కాంగ్రెస్‌, బీజేపీది ఒకటే వైఖరి.. పట్టభద్రుల ఓట్లడిగే హక్కు ఆ పార్టీలకు లేదన్న నిరంజన్‌రెడ్డి

కొత్త పరిశ్రమలు పెట్టి ప్రజలకు ఉపాధి కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం.. ఉన్న ఉపాధిని కూడా లేకుండా చేస్తుందని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. గ్యాస్, పెట్రోల్, డీజీల్ ధరలు పెంచి..

ఆ విషయంలో కాంగ్రెస్‌, బీజేపీది ఒకటే వైఖరి.. పట్టభద్రుల ఓట్లడిగే హక్కు ఆ పార్టీలకు లేదన్న నిరంజన్‌రెడ్డి
Follow us
K Sammaiah

|

Updated on: Mar 03, 2021 | 1:23 PM

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గ్యాడ్యుయేట్‌ ఓటర్లను ఆకర్షించేందుకు రెండు పార్టీలు నిరుద్యోగ సమస్యను ప్రధాన ఎజెండాగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో వనపర్తిలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. దేశంలో ప్రభుత్వ సెక్టార్‌లోని సంస్థలను అమ్మివేస్తూ ఉన్న ఉద్యోగాలు మోడి సర్కారు ఊడగొడుతుందని నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొత్త పరిశ్రమలు పెట్టి ప్రజలకు ఉపాధి కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం.. ఉన్న ఉపాధిని కూడా లేకుండా చేస్తుందని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. గ్యాస్, పెట్రోల్, డీజీల్ ధరలు పెంచి కేంద్రం సామాన్యుల నడ్డి విరుస్తుందని విమర్శించారు. దేశంలో సంపద దోచుకున్న వ్యాపారవేత్తలను కేంద్ర ప్రభుత్వం దగ్గరుండి క్షేమంగా విమానాలు ఎక్కించి విదేశాలకు పంపిస్తుందని ఆరోపించారు. పట్టభద్రులకు ఓ సామాన్యుడుగా విజ్ఞప్తి చేస్తున్నాను .. ఆలోచించి ఓటువేయండి .. అభివృద్ది చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలవండని నిరంజన్‌రెడ్డి అన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ఎన్నో వనరులున్న కేంద్రప్రభుత్వం లాభాల్లోకి తేలేకపోతే ప్రైవేటు సంస్థలు ఎలా తెస్తాయని మంత్రి ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థలు కేంద్రం ప్రైవేటుకు అప్పగిస్తే బడుగు, బలహీనవర్గాల పట్టభద్రుల పరిస్థితి ఏంటని అన్నారు. – జేఎన్ యూ విశ్వవిద్యాలయంలో చదివేది దేశంలోని సామాన్య విద్యార్థులు .. ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థ .. అలాంటిచోట ఆంక్షలతో విద్యార్థులను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో 10 శాతం ఉన్న వృద్దిరేటు మోడీ పాలనలో ఇప్పుడు – 7 శాతానికి పడిపోయింది .. ఏడేళ్లలో 17 శాతం క్షీణించిందని వివరించారు. మోడీ పాలనను, బీజేపీ పార్టీని తిరస్కరించడానికి ఈ ఒక్క కారణం చాలన్నారు.

గత ఏడాది కోవిడ్ వచ్చింది మరి అంతకుముందు ఆరేళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను మించి దేశంలోని ఇతర రాష్ట్రాలలో ఎక్కడైనా అమలుచేసి విపక్షాలు ఓట్లడగాలి .. కానీ కేసీఆర్ గారి మీద ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కొత్త జిల్లాల మూలంగా మారిన జోనల్ వ్యవస్థకు కేంద్రం అనుమతించకుండా ఉద్యోగుల పదోన్నతులు అడ్డుకుంటుందని ఆరోపించారు. నూతన వ్యవసాయచట్టాలతో కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్లకు అండగా నిలిచింది. నిత్యవసరాల చట్టం మార్చి ఎవరైనా ఎంతైనా నిలువ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

కాంగ్రెస్ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కొత్త వ్యవసాయ చట్టాలను ప్రస్తావించిందని మంత్రి నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ ఆలోచనలను మోడీ అమలులోకి తెచ్చారు .. కొత్త చట్టాల గురించి మాట్లాడే హక్కు ఆ రెండు పార్టీలకు లేదు .. ఆ విషయంలో ఆ రెండు పార్టీలదీ ఒకటే వైఖరి అని విమర్శించారు. మాజీ ప్రధాని కూతురైనా వాణిదేవిది సాధారణ జీవితమే. విద్యావేత్తగా ఆడంబరాలకు దూరంగా జీవించారు. పాలమూరు కోడలుగా వారికి ఓట్లేసి గెలిపిద్దాం. వాణిదేవి తప్ప ఎవరు గెలిచినా సమస్యలు పరిష్కరించే అవకాశం లేదన్నారు మంత్రి. వాణిదేవి నేరుగా సమస్యలు సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించగలుగుతారని చెప్పారు.

ఆరున్నరేళ్ల పసికూన తెలంగాణ రాష్ట్రం .. 28 రాష్ట్రాలలో తెలంగాణది ఆరున్నరేళ్ల ప్రస్థానమే. అయినా దేశంలో పురోగమిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ ముందుంది. దేశ తలసరి జీడీపీ కన్నా తెలంగాణ జీడీపీ ఎంతో ఎక్కువగా ఉంది. ఉద్యోగాలు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేది తెలంగాణ ప్రభుత్వమే. రాష్ట్రంలోని 60 లక్షల రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆసరాగా నిలుస్తుంది .. వారి కుటుంబాలను అర్థికంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం పనిచేస్తున్నది. పట్టభద్రులు, ఉద్యోగులు విజ్ఞతతో టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు.

Read More:

కాంగ్రెస్‌ పార్టీకి ఇందిరా శోభన్‌ రాజీనామా.. షర్మిలతో భేటీ అయిన టీపీసీసీ అధికార ప్రతినిధి

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!