అలా అయితే టీడీపీని మూసేస్తాం.. లేదంటే వైసీపీ దుకాణం కట్టేస్తారా..? కాక రేపుతున్న టీడీపీ.. వైసీపీ సవాళ్లు

ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫలితాలతో అధికార పార్టీ వైసీపీ ఫుల్‌ జోష్‌లో ఉంది. పంచాయతీ ఫలితాలే మున్సిపల్‌ ఎన్నికల్లో పునరావృతం అవుతాయని ఆ పార్టీ నేతలు ధీమా..

అలా అయితే టీడీపీని మూసేస్తాం.. లేదంటే వైసీపీ దుకాణం కట్టేస్తారా..? కాక రేపుతున్న టీడీపీ.. వైసీపీ సవాళ్లు
Follow us
K Sammaiah

|

Updated on: Mar 03, 2021 | 2:13 PM

ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫలితాలతో అధికార పార్టీ వైసీపీ ఫుల్‌ జోష్‌లో ఉంది. పంచాయతీ ఫలితాలే మున్సిపల్‌ ఎన్నికల్లో పునరావృతం అవుతాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో మున్సిపల్‌ ఎన్నికలు జరగనుండటంతో అధికార వైసీపీ -ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మధ్య మాటల యుద్ధం పీక్‌ స్టేజికి చేరుతుంది. రేణిగుంట విమానాశ్రయంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును ఆపేయడంతో ఏపీలో ప్రస్తుతం రాజకీయం రణరంగంగా మారింది.

ఇటీవల జరిగినవి పంచాయతీ ఎన్నికలే అయినా అసెంబ్లీ ఎన్నికలను తలపించాయి. ఇక మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అదే ఒరవడి కొనసాగుతుంది. ఇరు పార్టీల నేతలు విమర్శల పర్వం దాటి సవాళ్ల పర్వానికి తెరలేపారు. దీంతో జిల్లాలోఘర్షణ వాతావరణం నెలకొంది. రెండు రాజకీయ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్న నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వైసీపీకి సవాల్ విసిరారు. రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకోవడం సీఎం జగన్ పిరికిపంద చర్య అని మండిపడ్డారు.

చంద్రబాబే తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారన్న భయం జగన్‌లో మొదలైందని బుద్దా అభిప్రాయపడ్డారు. ఒకవేళ జగన్‌కు నిజంగా ప్రజాబలముంటే తక్షణమే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. అలా ఎన్నికలకు వెళ్లి.. ఆ ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఆదరిస్తే, టీడీపీని మూసేస్తామని బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. ప్రజాబలంతో టీడీపీ విజయం సాధిస్తే, వైసీపీ దుకాణం కట్టేయడానికి జగన్ సిద్ధమేనా? అంటూ ఛాలెంజ్ చేశారు.

ఇక బుద్ధా వ్యాఖ్యలకు వైసీపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. టీడీపీ నేతలకు తమ మీద తమ పార్టీ మీద నమ్మకం ఉంటే ఎమ్మెల్యేలను రాజీనామా చేసి.. ముందు ఒక్క సీటైనా గెలవమనండి అంటున్నారు.. లేదంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క నగరంలోనైనా గెలిచి చూపించాలని తిరిగి సవాళ్లు విసురుతున్నారు. మరోవైపు ఓటమి భయంతోనే టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మునిసిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు అంతే లేకుండా పోతోందని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ బెదిరింపులకు భయపడవద్దని నామినేషన్ వేసిన అభ్యర్థులకు పార్టీ తరపున భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతిలోనే మకాం వేసిన రాష్ట్రస్థాయి నేతలు పార్టీ అభ్యర్థులు విత్ డ్రా అవ్వకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. 6 వార్డులకు నామినేషన్ దాఖలు చేయడానికి టీడీపీ అభ్యర్థులతో తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్దకు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో కలసి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాబి కూడా వెళ్లారు.

టీడీపీకి చిత్తూరు ప్రజల నుంచి మద్దతు లభిస్తుండడంతో జిల్లా మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి., తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అరాచకాలకు తెరలేపారని పట్టాభి ఆరోపించారు. టీడీపీ తరుపున నామినేషన్ వేసిన వారిని ప్రలోభాలకు గురి చేసి.. అందుకు ఒప్పుకోకపోతే ఆస్తులపై దాడికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడకుండా పార్టీ వైపు ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు చిత్తూరు పర్యటనకు వస్తే ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత ఎక్కడ బయటపడుతుందో అనే అనుమానంతోనే.. అలా ఎయిర్ పోర్టులోనే పర్యటనను అడ్డుకున్నారని పట్టాభి ఆరోపించారు.

మొత్తానికి మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో అటు వైసీపీ, టీడీపీ నేతల మధ్య సవాళ్ల పర్వం రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది. మున్సిపల్‌ ఎన్నికలకు కొద్ది రోజులే ఉండటంతో ఇంకా ఎలాంటి సవాళ్లు వినిపిస్తాయోనని చర్చించుకుంటున్నారు.

Read More:

ఆ విషయంలో కాంగ్రెస్‌, బీజేపీది ఒకటే వైఖరి.. పట్టభద్రుల ఓట్లడిగే హక్కు ఆ పార్టీలకు లేదన్న నిరంజన్‌రెడ్డి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!