South India Famous Temples : దక్షిణ భారతదేశంలోని అందమైన ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు వాటి.. విశిష్టత

మన దేశ సంస్కృతి , సంప్రదాయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. తమ అపార మేధస్సుతో ఇప్పటి సైన్సుకు శాస్త్రానికి అందని గొప్పగొప్ప ఆవిష్కారణలు ఎప్పుడో చేశారు. ముఖ్యంగా భారత్ లో ఉన్న హిందూ దేవాలయాల నిర్మాణానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. విభిన్న శైలితో రూపుదిద్దుకున్న శిల్పాలతో ద్రవిడ శైలిలో ఉండే మన దక్షిణ భారతదేశంలోనే అత్యంత అద్భుతమైన దేవాలయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..!

  • Surya Kala
  • Publish Date - 1:16 pm, Wed, 3 March 21
1/9
tirumala
2/9
virupaksha-temple
విరూపాక్ష దేవాలయానికి ఒక ప్రత్యేకమైన చారిత్రిక నేపథ్య చరిత్ర వుంది. ఈ ఆలయాన్ని యూనిస్ కో ప్రపంచవారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7 వ శతాబ్దంలో రాజావిక్రామాదిత్యుని విజయానికి చిహ్నంగా హంపిలోని తుంగభద్ర నది తీరాన నిర్మించారు. ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యంత అందమైన పుణ్యక్షేత్రంలో ఒకటి.
3/9
brihadeeswarar-temple
మన దేశ అద్భుత వారసత్వ సంపద.తంజావూరు బృహదీశ్వరాలయం. ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళతో నిర్మితమైన ఈ ఆలయం గ్రానైట్‌ రాయితో తీర్చిదిద్దారు. ఆలయ గోపురాన్ని 80 టన్నుల ఏకరాతి గ్రానైట్‌ శిలపై నిర్మించినట్లు చెబుతారు ఈ ఆలయంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు, వింతలకు నెలవు.
4/9
meenakshi-temple
పాండ్య రాజులు కట్టించిన మీనాక్షి దేవాలయం మిక్కిలి ప్రసిద్ధి. ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో నిర్మించారని తెలుస్తోంది. అనంతరం ముస్లిం రాజులైన ఖిల్జీ సేనాన, మాలిక్‌ కపూర్‌ దండయాత్ర చేసి మీనాక్షి ఆలయంలో నుంచి విలువైన వస్తువులను దొంగలించారు. ద్వంసం చేశారు. దీంతో మళ్ళీ ఈ ఆలయాన్ని 16 వ శతాబ్దంలో పునర్నిర్మించారు.
5/9
ramanathaswamy-temple
రామనాథ స్వామి దేవాలయం శివుడి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. దీనిని తమిళనాడులో 7,8 శతాబ్దాల్లో నిర్మించారు. ఇక్కడ శివుడిని రాముడు పూజించాడని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ ఆలయం చూసేందుకు ఏటా వేల సంఖ్యలో భక్తుల హాజరవుతారు.
6/9
suchindram-temple
సుచింద్ర తనుమాలయన్ ఆలయం. కన్యాకుమారిలో ఉండే ఈ ఆలయం 1300 ఏళ్ల నాటిది.బ్రహ్మ, విష్ణు మరియు శివులను పూజిస్తున్న మనదేశంలో త్రిమూర్తులు కొలువైన ఆలయాల్లో ఇది ఒకటి. అనసూయ, అహల్యల ఇతిహాసాలకు ఈ ఆలయం అద్దం పడుతుంది.
7/9
Airavatesvara-Temple
ఐరావతేశ్వర దేవాలయం ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ దేవాలయాన్ని 12 వ శతాబ్దంలో రాజరాజ చోళుడు II నిర్మించాడు. ఇది యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఈ ఆలయ మెట్లు సంగీతాన్ని వినిపిస్తాయి. ఈ దేవాలయాలు చోళుళ నిర్మాణ శైలికి తార్కాణాలు
8/9
pattadakal-temple
ఐహోలు, పట్టడక్కల్‌ ప్రాంతాలు చాళుక్యుల రాజధానులు. ఇక ఇక్కడ మొత్తం పది ఆలయాలు ఉంటాయి. ఈ ప్రాంతం రాతికట్టడాలకు ఎంతో ప్రసిద్దిగాంచింది. క్రీ.శ. 5 వ శతాబ్దనికి చెందినవి. ఈ ఆలయాన్ని హిందూ వాస్తుశిల్పానికి ఊయల అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో దుర్గా మాత కొలువైంది.
9/9
vijay-vittal-temple
శ్రీ విజయ విట్టల దేవాలయం ఒక పురాతన స్మారక చిహ్నం. 15వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారుల కథనం. విఠలేశ్వర దేవాలయం ఆకర్షణీయమైన విశేషం సప్త స్వరాలు పలికే ఏడు సంగీత స్తంభాలు.ఈ దేవాలయంలోనే పురందరదాస ఆరాధనోత్సవాలు జరుతాయి.