వాకర్‌ సాయంతో కేసీఆర్‌ నడక.. ‘మై రాక్‌స్టార్‌’ అంటూ ప్రకాశ్ రాజ్ కామెంట్

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు వైద్యులు. వాకర్‌ సాయంతో డాక్టర్లు నడిపించారు. 6 నుంచి 8 వారాల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారని చెప్పారు. అటు కేసీఆర్‌ ఆరోగ్యంపై పలువురు ప్రముఖులు ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

వాకర్‌ సాయంతో కేసీఆర్‌ నడక.. 'మై రాక్‌స్టార్‌' అంటూ ప్రకాశ్ రాజ్ కామెంట్
KCR -Prakash Raj
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 09, 2023 | 6:08 PM

BRS అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హిప్ రిప్లేస్‌మెంట్ ఆపరేషన్‌ విజ‌య‌వంత‌మైంద‌ని..ఆయ‌న కోలుకుంటున్నార‌ని యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వాక‌ర్ సాయంతో కేసీఆర్ న‌డుస్తున్నార‌ని, మ‌రో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవ‌కాశం ఉంద‌ని వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని, త్వరగా కోలుకోవడానికి అనుకూలంగా శరీరం సహకరిస్తోందన్నారు. మానసికంగా కూడా కేసీఆర్‌ దృఢంగా ఉన్నారని తెలిపారు.

కేసీఆర్ త్వరగా కోలుకోవాలని యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ ఆకాంక్షించారు. కేసీఆర్‌కు ఆయన ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్‌ను మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.

యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌ను వాకర్‌ సాయంతో వైద్యులు నడిపించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నటుడు ప్రకాశ్‌రాజ్‌ స్పందించారు. కేసీఆర్‌ను ‘మై రాక్‌స్టార్‌’ అంటూ కామెంట్ పేర్కొన్నారు. మరోవైపు ఆపరేషన్‌ తర్వాత కేసీఆర్‌ ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, కూతురు ఎమ్మెల్సీ కవిత, కేసీఆర్‌ సతీమణి శోభ సహా కుటుంబ సభ్యులంతా ఆస్పత్రిలోనే ఉన్నారు. పలువురు బీఆర్‌ఎస్ నాయుకులు కూడా ఆస్పత్రి దగ్గరే ఉన్నారు. కేసీఆర్‌కు కనీసం 6 నుంచి 8 వారాల రెస్ట్ అవ‌స‌ర‌మ‌ని వైద్యులు చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…