KA Paul: ‘బీ కేర్ ఫుల్.. తెలంగాణ కు కాబోయే సీఎం నేనే’ – కే ఏ పాల్

|

Oct 22, 2022 | 3:24 PM

తెలంగాణలో మునుగోడు బై ఎలక్షన్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీ తో సహాయ ప్రధాన విపక్ష పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాయి. ఈ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ సైతం పోటీ చేస్తున్న విషయం..

KA Paul: బీ కేర్ ఫుల్.. తెలంగాణ కు కాబోయే సీఎం నేనే - కే ఏ పాల్
Ka Paul
Follow us on

తెలంగాణలో మునుగోడు బై ఎలక్షన్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీ తో సహాయ ప్రధాన విపక్ష పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాయి. ఈ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ సైతం పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మునుగోడు నియోజకవర్గం చండూరులో కేఏ పాల్ ఘాటుగా స్పందించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ తన ఫాలోవర్ అంటూ విధుల్లో ఉన్న ఓ అధికారి పై మండిపడ్డారు. తనను ఆపే అధికారం ఎవరు ఇచ్చారంటూ వాగ్వివాదానికి దిగారు. కాగా కేఏ పాల్ కు చెందిన రెండు ప్రచార వాహనాలు చండూరులో ప్రచార నిర్వహిస్తుండగా.. వాటి వెనకాలే వస్తున్న కేఏ పాల్ ను అధికారులు అడ్డుకున్నారు. దీంతో కేఏ పాల్ స్పందిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ నా ఫాలోవర్.. నేను పర్మిషన్ తీసుకునే ప్రచారం నిర్వహిస్తున్నా.. నేను తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రినీ రెస్పెక్ట్ ఇవ్వండి అంటూ మండిపడ్డారు. సదరు అధికారినీ నీ పేరు ఏంటంటూ అధికారి మెడలోని ఐడీ కార్డు లాక్కుని పేరు చూసే ప్రయత్నం చేశారు. దీంతో పక్కనే ఉన్న అధికారులు కెఏ పాల్ కు సర్ది చెప్పడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు నాదే. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు ప్రధాన పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికే టికెట్లు ఇచ్చాయి. ఇతర సామాజికవర్గాలను పట్టించుకోలేదు. నేను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసినప్పుడు కూడా ఆయన అనుచరులు జై కేఏ పాల్ అన్నారు. ఉంగరం గుర్తుకే మన ఓటు అంటూ మునుగోడు ప్రజలు నినదిస్తున్నారు. గెలిచిన ఆరు నెలల్లోనే ఒక యూనివర్శిటీ, ఒక కాలేజీ, ఒక హాస్పిటల్ కట్టిస్తాను. మండలానికి వెయ్యి ఉద్యోగాలను ఇప్పిస్తాను. మునుగోడులో పోటీ చేస్తున్న 27 మంది అభ్యర్థులు నాకు పూర్తి మద్దతు పలుకుతున్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు డిపాజిట్ రాదు.

– కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు

ఇవి కూడా చదవండి

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..