KA Paul: మేము చేసిన న్యాయపోరాటం వల్లే సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా.. కేఏ పాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

|

Feb 11, 2023 | 3:52 PM

సచివాలయం ప్రారంభోత్సవం వాయిదాపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము చేసిన న్యాయ పోరాటం వల్లే కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా..

KA Paul: మేము చేసిన న్యాయపోరాటం వల్లే సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా.. కేఏ పాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Ka Paul
Follow us on

సచివాలయం ప్రారంభోత్సవం వాయిదాపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము చేసిన న్యాయ పోరాటం వల్లే కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా పడిందన్నారు. అంబేడ్కర్ పుట్టిన రోజు ఏప్రిల్ 14న సెక్రటేరియట్ ను ప్రారంభించాలని హైకోర్టులో న్యాయ పోరాటం చేశామని.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు కూడా ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అందుకే కేసీఆర్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పారు. అయితే.. కేసీఆర్ తన తప్పును ఒప్పుకోకుండా ఎన్నికల కోడ్ తీసుకొచ్చి వాయిదా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున ప్రారంభించకుండా చేశామని హర్షం వ్యక్తం చేశారు. సెక్రెటేరియట్ లో జరిగిన అగ్నిప్రమాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.

కాగా.. తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేశారు. మొదట సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రారంభించాలనుకున్నారు. అయితే ఇంతలో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఎలక్షన్ కోడ్ ఉండడంతో సచివాలయం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. త్వరలోనే కొత్త సచివాలయం ప్రారంభోత్సవ తేదీని ప్రకటించనున్నట్లు వెల్లడించింది.

మరోవైపు.. సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఘనంగా ముందస్తు ఏర్పాట్లు చేసింది. సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టినందున అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. సభకు తమిళనాడు, జార్ఖండ్‌ ముఖ్యమంత్రులు స్టాలిన్‌, హేమంత్‌ సోరెన్‌, బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ తదితరనేతలకు ఆహ్వానాలు కూడా అందాయి. అయితే ఇంతలోనే సచివాలయం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..