Revanth Reddy: పేపర్ల లీక్‌లో పొలిటికల్‌ లింక్స్‌.. రేవంత్‌ ఆరోపణలపై పోతారం గ్రామస్తుల రియాక్షన్‌ ఏంటంటే?

|

Mar 19, 2023 | 8:05 PM

టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీక్‌ ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతోంది. రాజకీయంగా కలవరం కలిగిస్తోంది. ఈ స్కామ్‌లో లీకు వీరులే కాదు.. దీనిలో పొలిటికల్‌ లింక్స్‌ కూడా ఉన్నాయంటూ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

Revanth Reddy: పేపర్ల లీక్‌లో పొలిటికల్‌ లింక్స్‌.. రేవంత్‌ ఆరోపణలపై పోతారం గ్రామస్తుల రియాక్షన్‌ ఏంటంటే?
Revanth Reddy
Follow us on

టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీక్‌ ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతోంది. రాజకీయంగా కలవరం కలిగిస్తోంది. ఈ స్కామ్‌లో లీకు వీరులే కాదు.. దీనిలో పొలిటికల్‌ లింక్స్‌ కూడా ఉన్నాయంటూ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఒకే ఊళ్లో వందమందికి పేపర్‌ లీక్‌ చేశారంటున్న రేవంత్‌ మాటల్లో నిజమెంత? రాజకీయమెంత? టీవీ9 పరిశోధనలో తెలిసిన నిజాలేంటి? పోతారం గ్రామస్తులు ఏమంటున్నారో తెలుసుకుందాం రండి. టీఎస్‌పీస్సీ పేపర్‌ లీక్ స్కామ్‌పై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్‌లో మంత్రి కేటీఆర్‌ పీఏ తిరుపతి హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఒకే ఊరిలో వందమందికి పేపర్‌ లీక్‌ చేశాడన్నారు. అయితే రేవంత్‌ వ్యాఖ్యలను పోతారం గ్రామస్తులు తప్పపట్టారు. తమ ఊళ్లో పదిమంది మాత్రమే గ్రూప్‌-1 రాశారని స్పష్టం చేశారు. అందులోనూ ఒక్కరు మాత్రమే అర్హత సాధించారని వెల్లడించారు. రాజకీయాల కోసం ఊరికి చెడ్డ పేరు తేవద్దంటూ రేవంత్‌కు గ్రామస్తుల విజ్ఞప్తి చేశారు.

కాగా పేపర్‌ లీక్‌ స్కామ్‌ కు సంబంధించి రెండో రోజు సిట్‌ విచారణలో సంచలన నిజాలు వెలుగు చూశాయి. మూడేళ్లుగా రాజశేఖర్‌ ఆధీనంలోనే కంప్యూటర్లు ఉన్నాయని తేలింది. ఐపీ అడ్రస్‌లతో కంప్యూటర్లు హ్యాక్‌ చేసిన నిందితులు చేశారని బయటపడింది. నిర్వహణలోమే లీక్‌ కి ప్రధాన కారణంగా గుర్తించిన సిట్‌ అధికారులు, అత్యంత సులభంగా ఐపీ అడ్రస్‌లుమార్చి హ్యాక్‌ చేసినట్టు గుర్తించారు. ఇక రాజశేఖర్‌కు పరిచయం ఉన్నవారిపై సిట్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. గత మూడేళ్ళుగా రాజశేఖర్‌ ఏం చేశాడన్నదానిపై దృష్టిసారించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..