Leopard : మెదక్ జిల్లాలో చనిపోయిన చిరుతకి పోస్ట్ మార్టమ్ పూర్తి.. అయినా కొలిక్కిరాని మిస్టరీ.!

|

Jul 20, 2021 | 9:17 PM

మెదక్ జిల్లాలో చనిపోయిన చిరుతకు అటవీ శాఖ ఇవాళ పోస్ట్ మార్టమ్ నిర్వహించింది. శంకరం పేట్ (ఆర్) వెటర్నటీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ గీత ఆధ్వర్యంలో జరిగిన పోస్టు మార్టమ్‌లో..

Leopard : మెదక్ జిల్లాలో చనిపోయిన చిరుతకి పోస్ట్ మార్టమ్ పూర్తి.. అయినా కొలిక్కిరాని మిస్టరీ.!
Cheetha
Follow us on

Cheetah : మెదక్ జిల్లాలో చనిపోయిన చిరుతకు అటవీ శాఖ ఇవాళ పోస్ట్ మార్టమ్ నిర్వహించింది. శంకరం పేట్ (ఆర్) వెటర్నటీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ గీత ఆధ్వర్యంలో జరిగిన పోస్టు మార్టమ్‌లో చిరుత మృతికి కారణాలు పూర్తిస్థాయిలో తెలియ రాలేదు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవు. అలాగే ఉచ్చులు, విద్యుత్ గాయాలైన ఆనవాళ్లు కూడా లభించలేదు. తోకపైన మాత్రం ముళ్లపంది ముళ్లను గుర్తించారు. దీంతో చిరుత మృతికి కారణాలను గుర్తించేందుకు అంతర్గత అవయవాలను సేకరించిన డాక్టర్లు.. తదుపరి పరీక్షల కోసం సంగారెడ్డి వెటర్నిటీ ల్యాబ్ కు తరలించారు.

చిరుత కళేబరాన్ని అధికారుల సమక్షంలో ఖననం చేశారు. మెదక్ జిల్లా అటవీ అధికారి జీ. జ్ఞానేశ్వర్, రేంజ్ ఆఫీసర్ నదియా తబుస్సుమ్, సెక్షన్ ఆఫీసర్ టీ. కృష్ణ, సిబ్బంది పర్యవేక్షణలో పోస్టు మార్టమ్, ఖననం జరిగాయి. అంతకు ముందు.. ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో మెదక్ జిల్లా రామాయం పేట్ రేంజ్ ఖాజాపూర్ రిజర్వు ఫారెస్ట్ పరిధి పటేల్ చెరువులో చిరుత కళేబరాన్ని చూసిన ఖాజాపూర్ గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే చిరుత చనిపోయిన ప్రాంతానికి చేరుకున్న సిబ్బంది, చిరుత మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీసి, వెటర్నటీ డాక్టర్ల సమక్షంలో పరిశీలించారు. అలాగే పరిసరాల్లో గాలించి ప్రమాద కారణాలను ఆరాతీశారు. చిరుత గోర్లు యథావిధిగా ఉండటం, శరీరం బయట ఎలాంటి గాయాలు లేకపోవటంతో వేటగాళ్ల ప్రమేయం ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.

Read also: Dakkili Temple Construction : అమ్మ చెప్పిన మాట కోసం ఆస్తులు అమ్మి మరీ గుడి కట్టాడు.. ఇప్పుడాయన పరిస్థితి ఎలా ఉందంటే..!