Ponguleti Srinivasa Reddy Exclusive Interview: డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదని.. తాను ప్రజా సేవ చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. టీవీ9 బిగిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో పాల్గొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. రజినీకాంత్ ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఫండ్ ఇచ్చి మరి కాంగ్రెస్ పార్టీలో చేరారా..? అన్న ప్రశ్నకు పొంగులేటి మాట్లాడుతూ.. ఫండ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. సమైక్యవాద పార్టీలో చేరి ఎంపీగా గెలిచిన మాట వాస్తవమేనని.. తనను ప్రజలు ఆశీర్వదించారని పేర్కొన్నారు. తర్వాత బీఆర్ఎస్ లో చేరానని.. పదవులు ఇవ్వలేదని పార్టీ మారలేదని పేర్కొన్నారు.
పార్టీ నుంచి శని పోయిందన్న మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై పొంగులేటి ఫైర్ అయ్యారు. శని పోయిందో.. తగులుతుందో వెయిట్ చేయాలంటూ పేర్కొన్నారు. ఐదు నెలల్లో తెలుస్తుందంటూ పొంగులేటి పేర్కొన్నారు. పార్టీలో ఎంత గౌరవం ఇచ్చారో అంతరికీ తెలుసని.. పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..