Telangana Thalli: మీ తల్లి మీదే.. మా తల్లి మాదే..! తెలంగాణ తల్లిపై రాజకీయ రగడ..

తెలంగాణాకు తల్లి రూపంలో విగ్రహం ఉండాలి కానీ, దేవత రూపంలో కాదన్న భావనతోనే ఈ విగ్రహం రూపొందించామంటున్న రేవంత్ కొత్త విగ్రహ రూపంపై విపక్షంతో పాటు రచయితల సంఘం అభ్యంతరాలు. అభయ హస్తం ముద్ర కాంగ్రెస్ ఎన్నికల గుర్తును పోలివుందన్న బీజేపీ. చేతిలో బతుకమ్మ లేకపోవడంపై అసెంబ్లీలో బీజేపీ ఆగ్రహం.. పోటీగా మేడ్చల్‌లో బీఆర్‌ఎస్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ... ఇలా అన్ని ఒక్క రోజులోనే (డిసెంబర్ 9న) జరిగిపోయాయి..

Telangana Thalli: మీ తల్లి మీదే.. మా తల్లి మాదే..! తెలంగాణ తల్లిపై రాజకీయ రగడ..
Telangana Talli Statue

Updated on: Dec 09, 2024 | 9:45 PM

భావన కాదు భావోద్వేగం.. తెలంగాణ అస్థిత్వానికి చిహ్నం.. బతుకమ్మ లేకుండా విగ్రహం.. తెలంగాణ తల్లిపై రాజకీయ లొల్లి.. తల్లి ఎలా ఉండాలి? అమ్మ ఆహార్యం ఎలా కనిపించాలి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు విగ్రహం చుట్టే జరుగుతోంది చర్చ. ప్రభుత్వాలు మారితే పాత పథకాల్లో కొన్ని ఆగిపోతాయి. కొత్త పథకాలు తెరపైకొస్తాయి. కానీ అధికారం మారగానే సంస్కృతీ సంప్రదాయాలు మారిపోతాయా, ఆత్మగౌరవ అంశాలు తెరపైకొస్తాయా అనేది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. కొత్త రూపురేఖలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర పాలనాకేంద్రంలో ఆవిష్కరించడంపై రాజకీయ రచ్చతో పాటు భావోద్వేగ చర్చ జరుగుతోందిప్పుడు. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి నిలువెత్తు రూపం కొలువుదీరింది. 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్‌లో ఆవిష్కరించింది తెలంగాణ ప్రభుత్వం. బీఆర్‌ఎస్‌ ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. బీజేపీ కూడా తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కొంచెం ఇష్టం కొంచెం కష్టమన్నట్లే ప్రతిస్పందించింది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దామని ప్రకటించుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. లక్ష మంది మహిళల సమక్షంలో గ్రాండ్‌గా విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రేవంత్ రెడ్డి ఏమన్నారంటే.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ముందే అసెంబ్లీలో ఈ అంశంపై మాట్లాడారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణ తల్లి విగ్రహం నాలుగుకోట్ల మంది బిడ్డల భావోద్వేగమన్నారు. ప్రశాంత వదనంతో నిండైన రూపంతో చాకలి ఐలమ్మ, సారలమ్మ పోరాట స్ఫూర్తి కనిపించేలా...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి