భూపాలపల్లిలో రాజకీయం వేడెక్కింది. నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో అంబేడ్కర్ సెంటర్‌లో పోలీసుల పహారా కనిపిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి యాత్రలో కొంతమంది దాడి చేయడంతో వాళ్లూ వీళ్లు కాదూ.. దమ్ముంటే ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ డైరెక్ట్ వచ్చి తేల్చుకోవాలని సవాల్ విసిరారాయన. అవినీతి అక్రమాలన్నీ బయటపెడతామన్నారు. అయితే టైమ్ ఫిక్స్‌చేస్తే అంబేద్కర్ సెంటర్‌కే వస్తానంటూ గండ్ర ప్రతి సవాలు విసిరారు. దీంతో 11 గంటలకు భూపాలపల్లిలో ఏం జరగబోతుందన్నది ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ మాత్రం ఎమ్మెల్యే అవినీతి చిట్టా మొత్తం బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..