Telangana: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య మంటపెడుతున్న అగ్రిమెంట్.. తాండూరు టీఆర్ఎస్‌లో ఇంట్రస్టింగ్ సీన్..

|

Aug 02, 2022 | 9:35 PM

Telangana: ఎంకి పెళ్లి-సుబ్బి చావుకొచ్చిందన్నట్టుగా తయారైంది తాండూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పంచాయితీ.

Telangana: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య మంటపెడుతున్న అగ్రిమెంట్.. తాండూరు టీఆర్ఎస్‌లో ఇంట్రస్టింగ్ సీన్..
Trs
Follow us on

Telangana: ఎంకి పెళ్లి-సుబ్బి చావుకొచ్చిందన్నట్టుగా తయారైంది తాండూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పంచాయితీ. రెండున్నరేళ్ల క్రితం చేసుకున్న అగ్రిమెంట్‌ ఇప్పుడు ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ మధ్య మంటలు రేపుతోంది. ఇంతకీ ఆ ఒప్పందం ఏంటి? అసలు, తాండూరు టీఆర్‌ఎస్‌లో ఏం జరుగుతోంది?

తాండూరు టీఆర్‌ఎస్‌లో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయ్‌. తాండూరు మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవిపై చెలరేగిన వివాదం తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అనుచరుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాలు పోటాపోటీ ప్రెస్‌మీట్స్‌తో తాండూరులో హీట్‌ పుట్టించారు. ఒప్పందం ప్రకారం తాండూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ స్వప్న రాజీనామా చేయకపోతే తిరగనివ్వమని హెచ్చరించారు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అనుచరులు

ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అనుచరులకు అంతే దీటుగా కౌంటర్‌ ఇచ్చింది ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గం. ఎలా తిరగనివ్వరో చూస్తామంటూ ప్రతి సవాలు విసిరారు. అడ్డుకుని చూడండి, మా ప్రతాపమేంటో చూపిస్తామంటూ వార్నింగ్‌ ఇచ్చారు. వికారాబాద్‌, తాండూరు ఛైర్‌పర్సన్లపై వివాదం కొనసాగుతోంది. రెండున్నరేళ్ల టర్మ్‌ తర్వాత రాజీనామా చేసేలా అగ్రిమెంట్‌ జరిగింది. ఒప్పందం ప్రకారం రిజైన్‌ చేయాలని ఎమ్మెల్యే వర్గం డిమాండ్ చేస్తుంటే, రాజీనామా చేసేదే లేదంటోంది ఎమ్మెల్సీ గ్రూప్‌. ఈ వివాదం మరింత ముదిరి, ఇప్పుడు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకునే స్థాయికి చేరింది. ప్రస్తుతం పోటాపోటీ ప్రెస్‌మీట్స్‌తో చెలరేగిపోయిన ఇరువర్గాలు ముందుముందు గ్రౌండ్‌లో ఎలా తలపడతాయో? ఈ గొడవ ఎటువైపు దారి తీస్తుందో మరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..