MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు..

|

Aug 23, 2022 | 7:08 PM

వివాదస్పద వ్యాఖ్యలు చేసిన MLA రాజాసింగ్‌ను నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు రాజా సింగ్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు..
Raja Singh
Follow us on

వివాదస్పద వ్యాఖ్యలు చేసిన MLA రాజాసింగ్‌ను నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రాజాసింగ్‌ను అరెస్ట్‌ చేసి బొల్లారం పీఎస్‌కు తరలించారు. అక్కణ్నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లి.. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. 14వ అడిషనల్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌.. రాజాసింగ్‌కు 14రోజు రిమాండ్‌ విధించారు. రాజాసింగ్‌ పెట్టుకున్న బెయిల్‌ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. కోర్టు ఆదేశాల మేర‌కు రాజా సింగ్‌ను చంచ‌ల్‌గూడ జైలుకు పోలీసులు త‌ర‌లించారు. ఈ క్రమంలో చంచల్‌గూడ జైలు దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.  దీంతో కోర్టుకు భారీగా చేరుకున్నారు అభిమానులు..దీంతో నాంపల్లి కోర్టు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు..రాజాసింగ్‌ వ్యాఖ్యలపై ఎల్బీనగర్‌, వనస్థలిపురం, బాలాపూర్‌, కుషాయిగూడ పీఎస్‌లలో ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్‌లో కేసు నమోదైంది.

ఇక రాజాసింగ్‌ను జడ్జిముందు హాజరుపర్చారు పోలీసులు..అటు నాంపల్లి కోర్టు దగ్గర ఉద్రిక్తత వాతావరణ నెలకొంది..రాజాసింగ్‌ అనుచరులు కోర్టు ఆవరణలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు..దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసుల వారిని అడ్డుకున్నారు..దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది..అయితే ఆందోళనకారులను చెదరగొడుతున్నారు పోలీసులు.

మరోవైపు మతపరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌పై వేటు వేసింది బీజేపీ. పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. అన్ని బాధ్యతల నుంచి తప్పించింది. శాసనసభ పక్ష నేత పదవి నుంచి తొలగించింది. మూడు రోజుల కిందట స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌ షోపై అభ్యంతరం వ్యక్తం చేశారు రాజాసింగ్‌. అయినా మునావర్‌ షో ఆగలేదు.

ఇవి కూడా చదవండి

దీంతో ఓ వీడియో విడుదల చేశారు రాజాసింగ్‌. అందులో మతపరంగా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాటిపై అర్ధరాత్రి నుంచి పాతబస్తీలో ఆందోళనలు కొనసాగాయి. దేశ వ్యాప్తంగానూ నిరసనలు జరిగాయి. చాలా చోట్ల రాజాసింగ్‌పై కేసులు నమోదయ్యాయి. పోలీసుల సూచనలతో రాజాసింగ్‌ వీడియోను డిలీట్‌ చేసింది యూట్యూబ్‌.

దీనిపై మళ్లీ రియాక్ట్‌ అయ్యారు రాజాసింగ్‌. తాను ఎవరి పేరును ప్రస్తావించలేదంటూనే మునావర్‌ షోపై విమర్శలు చేశారు. రెండో వీడియోను కూడా విడుదల చేస్తానని ప్రకటించారు. మరోవైపు చాలా చోట్ల ఆందోళనలు కొనసాగడం, కేసులు పెట్టిన నేపథ్యంలో ఈ ఉదయం రాజాసింగ్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు.

స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌ షో కేంద్రంగా మాటల తూటాలు పేలుతున్నాయి. షో వద్దని చెప్పినా వినకుండా పెడతారా అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే షకీల్‌. రాజాసింగ్‌ నాలుక కోస్తామని వార్నింగ్‌ ఇచ్చారు.

మరోవైపు సోషల్‌ మీడియాలో రాజాసింగ్‌ పెట్టిన వీడియోపై మజ్లిస్‌ ఆందోళనలు చేపట్టింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై భగ్గు మన్న ఎంఐఎం శ్రేణులు, మనోభావాలు దెబ్బతీశారంటూ పలు పోలీసుస్టేషన్ల ఎదుట నిరసనలు తెలిపారు. పోలీసుల ఫిర్యాదుతో యూట్యూబ్‌ రాజాసింగ్‌ వీడియోను తొలగించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం