Hyderabad: హైదరాబాద్ కు ప్రధాని మోదీ.. బందోబస్తు విధుల్లో అలసత్వం వహిస్తే సీరియస్ యాక్షన్

| Edited By: Janardhan Veluru

Jul 01, 2022 | 5:54 PM

జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ (Hyderabad) లోని మాదాపూర్ హెచ్ఐసీసీలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రధాని రాక సందర్భంగా సైబరాబాద్ పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు....

Hyderabad: హైదరాబాద్ కు ప్రధాని మోదీ.. బందోబస్తు విధుల్లో అలసత్వం వహిస్తే సీరియస్ యాక్షన్
Hihg Security In Hyderabad
Follow us on

జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ (Hyderabad) లోని మాదాపూర్ హెచ్ఐసీసీలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రధాని రాక సందర్భంగా సైబరాబాద్ పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. సైబరాబాద్ (Cyberabad) పోలీసు కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐ‌పీఎస్, పోలీసు ఉన్నతాధికారులు భద్రతా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎస్పీజీఎస్, బ్లూ బుక్‌కు కట్టుబడి ఉండేలా అన్ని భద్రతా ప్రణాళికలు చేపట్టారు. మూడంచెల బందోబస్తు ప్రణాళికలు రూపొందించామని, యాక్సెస్ కంట్రోల్‌తో పాటు విధ్వంస నిరోధక జాగ్రత్తలు, వీవీఐపీల రక్షణ కోసం భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతలు , ట్రాఫిక్ అధికారులు అన్ని భద్రతా ప్రణాళికలను పాటించాలన్నారు. వీవీఐపీలు, వీఐపీ ల తాకిడి ఎక్కువగా ఉంటుందని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. అందరూ టీమ్ స్పిరిట్ తో పనిచేయాలని, విధుల్లో సంయనంతో వ్యవహరించాలన్నారు. విధులలో ఎవరైనా అలసత్వం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ప్రధాని పర్యటన వివరాలు, ఆయన రాక, బస, హాజరు, నిష్క్రమణ వివరాలు, అత్యవసర పరిస్థితుల్లో ఆకస్మిక ప్రణాళికలు తదితరాలపై చర్చించారు. బందోబస్తు సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలు, నిర్వహించాల్సిన విధులను వివరించారు. పోలీసులు వేదిక వద్ద ఏర్పాటు చేయనున్న కంట్రోల్ సెంటర్ నుంచి ఏదైనా సమస్యను త్వరగా పరిష్కరించేందుకు అధికారులను నియమిస్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ వార్తల కోసం..