తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై పోలీసులు కుట్ర కేసు నమోదు చేశారు. పేపర్ లీకేజ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర పన్నారని పోలీసులు సెక్షన్ 5 కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు వరంగల్ లో బండి సంజయ్ పై కేసు నమోదైంది. కేసును బొమ్మలరామారం నుంచి వరంగల్ కు బదిలీ చేయనున్నట్లు పేర్కొంటున్నారు. అయితే, మొదట బొమ్మలరామారం నుంచి బండి సంజయ్ ను వరంగల్ కు తరలించనున్నట్లు పేర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత కాన్వాయ్ ఆలేరుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, బండి సంజయ్ వ్యవహారంలో పోలీసులు సిక్రెట్ గా వ్యవహారిస్తున్నారు. కాసేపట్లో బండి సంజయ్ ను పోలీసులు జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం..
అయితే, బండి సంజయ్ పై కుట్ర కేసు అని పేర్కొన్న పోలీసులు.. పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..