CI Nageswara Rao : సీఐ నాగేశ్వర్ కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్.. దర్యాప్తులో షాకింగ్‌ నిజాలు!

ఈనెల 10న నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేసి వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో..

CI Nageswara Rao : సీఐ నాగేశ్వర్ కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్.. దర్యాప్తులో షాకింగ్‌ నిజాలు!
Ci Nageswara Rao Case

Updated on: Jul 14, 2022 | 1:00 PM

CI Nageswara Rao : వివాహితపై అత్యాచారం, కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావు కేసులో బాధితులతో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. కాగా, ఈ కేసులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయని సమాచారం. ఈ కేసు దర్యాప్తుకు వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తమ్‌రెడ్డి నేతృత్వంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్‌ సాగిస్తున్నారు. అత్యాచారం ఘటనా స్థలం నుంచి ఇబ్రహీంపట్నం యాక్సిడెంట్ వరకు కీలక ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. వనస్థలిపురం నివాసం నుంచి ఇబ్రహీంపట్నంలో ప్రమాదం జరిగిన ప్రాంతం వరకూ పోలీసులు పరిశీలించారు.

ఇబ్రహీంపట్నం చెరువులో.. నాగేశ్వర్ ఫోన్‌లు పడేసిన ప్రాంతంలో బాధితుడితో కలిసి పరిశీలించారు. బాధితురాలికి మరోసారి పోలీసులు వైద్య పరీక్షలు చేయిస్తున్నట్టు సమాచారం. ఈనెల 10న నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేసి వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, కొవిడ్‌, లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించిన అనంతరం హయత్‌నగర్‌ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రిమాండ్‌ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి