Viral Video: మహిళపై ఒక్కసారిగా ఎగబడ్డ రెండు సింహాలు..! ఆ తర్వాత జరిగింది చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు..

సాధారణంగా 'సింహం' అడవిలో అత్యంత ప్రమాదకరమైన జంతువు..దాని బలం, ధైర్యం అంతాఇంతా కాదు. దాని ముందు ఏ ఇతర జంతువు నిలబడలేదు.

Viral Video: మహిళపై ఒక్కసారిగా ఎగబడ్డ రెండు సింహాలు..! ఆ తర్వాత జరిగింది చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు..
Two Lions
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 14, 2022 | 12:40 PM

Switzerland Woman: అడవిలో రకరకాల జంతువులు ఉంటాయి. వాటిలో కొన్నిక్రూర మృగాలతో పాటు, సాధు జీవులు కూడా జీవిస్తుంటాయి. సింహం, పులి, చిరుత పులి, ఎలుగుబంటి, మొసలి, నక్కలు, హైనాల వంటి రకరకాల క్రూర మృగాలు ఉంటాయి. ఇక .. జింకలు, జిరాఫీలు, విల్డర్ బీస్ట్, ఏనుగుల వంటి సాధు జంతువులు కూడా ఉంటాయి. సాధారణంగా ‘సింహం’ అడవిలో అత్యంత ప్రమాదకరమైన జంతువు..దాని బలం, ధైర్యం అంతాఇంతా కాదు. దాని ముందు ఏ ఇతర జంతువు నిలబడలేదు. ఎంతో చురుకుగా ఉండే సింహాన్ని ‘అడవి రాజు’ అని కూడా అంటారు. అలాంటి సింహాన్ని మనం దూరం నుంచి చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఇక అది మనవైపు చూసిందంటే వెనక్కి తిరిగి చూడకుండా పరుగు అందుకుంటాం. అలాంటి రెండు సింహాలు ఓ మహిళను ప్రేమగా హత్తుకుని ముద్దులు పెట్టాయి.

అయ్య బాబోయ్‌.. సింహాలు మహిళను ప్రేమగా హత్తుకోవడం ఏంటి.. ముద్దులు పెట్టడం ఏంటని షాక్‌ తిన్నారు కదా… కానీ, స్విట్జర్లాండ్‌లోని ఓ జూలో ఇలాంటిదే ఓ షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ మహిళ 7 సంవత్సరాల క్రితం రెండు సింహాలను పెంచింది. వాటిని ప్రతిరోజు ఎంతో అపురూపంగా చూసుకునేది. రెండు సింహాలతో కలిసి ఆడుకునేదట. అయితే సింహాలు ఇంట్లో ఉండడం హానికరం అని జూ సిబ్బంది వాటిని తీసుకెళ్లారు. అప్పటి నుండి ఆ రెండు సింహాలు జూలోనే ఉంటున్నాయి. అయితే, ఇటీవల ఆమె జూను సందర్శించడానికి వెళ్లింది. రెండు సింహాలు ఉండే చోటుకు ఆమె వెళ్లగానే.. అవి తన యజమానిని చూసి పరుగెత్తుకుంటూ వచ్చాయి. సెక్యూరిటీ కంచెపై నుంచే మహిళను తమ ముందు కాళ్లతో హత్తుకుని తమ ప్రేమను చూపించాయి. అందులో ఓ సింహం అయితే తన యజమానిని గట్టిగా హత్తుకుని ముద్దులు పెట్టింది. రెండు ఒకేసారి ఆమె మీద పడినా వాటి బరువును మోస్తూ..ఆ మహిళ సంతోషం వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి

రెండు సింహాలు మహిళను ప్రేమగా హత్తుకున్న వీడియోను తార్క్ సాహిత్య అనే ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటివరకు ఈ వీడియోకి 71 వేల మంది లైక్ చేశారు. వేల సంఖ్యలో నెటిజన్లు కామెంట్లు, షేర్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన