CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అభ్యంతకర స్కిట్ కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. ఆర్టిస్ట్ బరుపట్ల రాజును A5 గా చేర్చి అరెస్టు చేశారు హయత్ నగర్ పోలీసులు. ఇక A6 గా డాన్సర్ కొమ్ము శ్రీరాములును చేర్చి అరెస్ట్ చేశారు పోలీసులు. జూన్ 2న సీఎం కేసీసీఆర్‌పై స్కిట్ వేసి అగౌరవపరిచారంటూ టీఆర్‌ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన పోలీసులు వారిని అరెస్టు చేశారు.
ఈ కేసులో A1గా బండి సంజయ్, A2 గా జిట్టా బాలకృష్ణ, A3 రాణి రుద్రమ, A4దరువు ఎల్లన్నలను చేర్చారు.ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు.
కాగా, సూర్యపేట జిల్లా నూతన్‌కల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన కొమ్ము శ్రీరాములు, వరంగల్ జిల్లా ఖిల్లా పరిధిలో దూపకుంటకు చెందిన బరుపట్ల రాజు అలియాస్ రవిలను పోలీసులు అరెస్టు చేశారు.ఈనెల 2న తెలంగాణ ఆవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ నిర్వహించిన నాటకంలో సీఎం కేసీఆర్‌ను కించపర్చేలా ఈ ఇద్దరు కళాకారులు స్కిట్ చేశారని వారిని అరెస్టు చేశారు. ఇలా కేసీఆర్‌ను కించపర్చే విధంగా స్కిట్ చేశారనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేతలు ఈ నాటకంలో తప్పుడు ప్రచారం చేశారని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కేసీఆర్‌పై వ్యక్తిగతంగా దాడులకు దిగారని టీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి