అత్తారింటికి వచ్చిన అల్లుడు.. వీడిన కుక్కల గన్ ఫైర్ మిస్టరీ..

పెంపుడు కుక్కల మీద ప్రేమ వీధి కుక్కలను కాల్చిచంపే వరకు తెచ్చింది. మహబూబ్‎నగర్ జిల్లాలో కలకలం రేపిన కుక్కల కాల్చివేత ఘటనలో ఎట్టకేలకు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మిస్టరీగా మారిన ఈ దారుణానికి అసలు కారణాలు బయటపెట్టారు ఖాకీలు. గత నెల ఫిబ్రవరి 15న ఉమ్మడి పాలమూరు జిల్లా పొన్నకల్ గ్రామంలో వీధి కుక్కల కాల్చి చంపిన ఘటన సంచలనం రేపింది.

అత్తారింటికి వచ్చిన అల్లుడు.. వీడిన కుక్కల గన్ ఫైర్ మిస్టరీ..
Fire On Street Dogs

Edited By: Srikar T

Updated on: Mar 20, 2024 | 7:39 AM

పెంపుడు కుక్కల మీద ప్రేమ వీధి కుక్కలను కాల్చిచంపే వరకు తెచ్చింది. మహబూబ్‎నగర్ జిల్లాలో కలకలం రేపిన కుక్కల కాల్చివేత ఘటనలో ఎట్టకేలకు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మిస్టరీగా మారిన ఈ దారుణానికి అసలు కారణాలు బయటపెట్టారు ఖాకీలు. గత నెల ఫిబ్రవరి 15న ఉమ్మడి పాలమూరు జిల్లా పొన్నకల్ గ్రామంలో వీధి కుక్కల కాల్చి చంపిన ఘటన సంచలనం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రామ మొత్తం తిరుగుతూ కనబడిన ప్రతి కుక్కను తుపాకీతో కాల్చిచంపారు. ఓ వైపు కుక్కల అరుపులు, మరోవైపు బుల్లెట్ల చప్పుడుకు గ్రామంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. భయాందోళనకు గురైన గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. తీరా ఉదయం లేచి చూసేసరికి గ్రామంలోని వీధుల్లో కుక్కలు రక్తపు మడుగులో చనిపోయి దర్శనిమిచ్చాయి. సుమారు 25కుక్కలను దుండగులు కాల్చి చంపారు. గ్రామస్తుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అత్తరింటికి వచ్చి అరాచకం సృష్టించి..

ఫిబ్రవరి నెల మొదటి వారంలో మంద నరసింహారెడ్డి అనే వ్యక్తి పొన్నకల గ్రామంలోని అత్తారింటికి వచ్చాడు. అయితే ఇంటికి వచ్చిన రాత్రి ఆ ఇంట్లో ఉన్న రెండు పెంపెడు కుక్కలపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇందులో ఒక పెంపు కుక్క మరణించగా, మరొక కుక్కకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహానికి గురైన నరసింహారెడ్డి.. గ్రామంలో ఉన్న కుక్కలను మట్టుబెట్టాలని నిర్ణయించాడు. అదే నెల 15న మిత్రులు తారీక్ అహ్మద్, మహమ్మద్ తాహిర్‎లను వెంటబెట్టుకొని అత్తారింటికి విందుకు వచ్చాడు. రాత్రి గ్రామంలో అందరూ నిద్రించారని తెలసుకున్నాక మిత్రుడి బెంజ్ కారు(TS11EF 7860)లో తిరిగుతూ కనిపించిన కుక్కను వదలకుండా విచక్షణారహితంగా కాల్చి చంపారు. తారీక్ అహ్మద్‎కు చెందిన లైసెన్సుడ్ వెపన్ 22 రైఫిల్ ఉపయోగించి శునకాలను హతరమార్చారు. దాదాపుగా గ్రామంలోని 25 కుక్కలను చంపారు.

పక్కా సమాచారంతో అదుపులోకి..

దర్యాప్తులో భాగంగా నిందితులను గుర్తించిన పోలీసులు మార్చి 19 మధ్యాహ్నం పొన్నకల్ గ్రామంలోనే అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులు అదే బెంజ్ కారులో దావత్ చేసుకునేందుకు పొన్నకల్ గ్రామానికి చేరుకున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు మాటు వేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 22రైఫిల్, బెంజ్ కారు, 6మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..