UNWTO – Pochampally: పోచంపల్లి గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు.. భారత్‌ నుంచి ఎంపికైన ఏకైక గ్రామం ఇదే..!

UNWTO - Pochampally: తెలంగాణలోని పోచంపల్లి గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. రాష్ట్రంలోని పోచంపల్లి గ్రామాన్ని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక...

UNWTO - Pochampally: పోచంపల్లి గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు.. భారత్‌ నుంచి ఎంపికైన ఏకైక గ్రామం ఇదే..!
Pochampally

Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 16, 2021 | 7:21 PM

UNWTO – Pochampally: తెలంగాణలోని పోచంపల్లి గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. రాష్ట్రంలోని పోచంపల్లి గ్రామాన్ని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా ఎంపిక చేసింది. ఇదే విషయాన్ని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 2న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగే UNWTO జనరల్ అసెంబ్లీ 24వ సెషన్‌లో ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేయనున్నారు. కాగా, ఈ అవార్డు కోసం భారత్ నుంచి 3 గ్రామాలను ఎంట్రీలుగా పంపించింది కేంద్ర ప్రభుత్వం. మేఘాలయలోని కోంగ్‌తాంగ్, మధ్యప్రదేశ్‌లోని లాధ్‌పురా ఖాస్, తెలంగాణలోని పోచంపల్లి గ్రామాలను పేర్కొంది.

వీటిని పరిశీలించిన యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రతినిథి బృందం.. పోచంపల్లి గ్రామాన్ని ఐక్యరాజ్యసమితి ప్రంపచ పర్యాటక సంస్థ జాబితాలో ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. పోచంపల్లి గ్రామానికి గుర్తింపు రావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పోచంపల్లి గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు లభించడానికి కృషి చేసిన అధికారులను మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసించారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘వోకల్ 4 లోకల్’ మంత్రం ద్వారా పోచంపల్లికి సంబంధించిన ప్రత్యేకమైన నేత శైలులు, నమూనాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయన్నారు. గ్రామ ప్రజల శ్రమ, స్వయం కృషి, అధికారుల కృషి వల్లే ఇది సాధ్యమైందని మంత్రి పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. పోచంపల్లి గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఐక్యరాజ్యసమితి ప్రంపచ పర్యాటక సంస్థ జాబితాలో ఉత్తమ పర్యాటక గ్రామంగా పోచంపల్లి ఎంపిక కావడానికి ఆ గ్రామస్తుల నైపుణ్యమే కారణం అని కొనియాడారు.

Also read:

AP MPTC And ZPTC Elections 2021 Live: ఏపీలో కొనసాగుతున్న ప్రాదేశిక ఎన్నికలు.. మందకొడిగా పోలింగ్‌..

Purvanchal Expressway Inauguration: ప్రశ్నిస్తున్న వారికి పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేనే సమాధానం.. ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ..

Telangana Politics: ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్‌లోనే బీజేపీ నేతలపై దాడులు.. డీకే అరుణ సంచలన కామెంట్స్..!