PM Modi: మారుతున్న దేశభవిష్యత్‌కు ఉదాహరణ.. విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ ప్రారంభోత్సవంలో మోదీ..
Vande Bharat Express: తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం రైల్వే స్టేషన్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు.
తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం రైల్వే స్టేషన్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. వర్చువల్‌గా జెండా ఊపి ట్రైన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన పీఎం మోదీ.. తెలంగాణ-ఏపీకి వందేభారత్ పండుగ కానుక అని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఇక వేగవంతమైన జర్నీ సాగుతుందన్నారు. వందేభారత్‌తో విలువైన సమయం ఆదా అవుతుందని చెప్పారు. మారుతున్న దేశభవిష్యత్‌కు వందేభారత్ ఉదాహరణ అని పేర్కొన్నారు. 2023లో ప్రారంభిస్తున్న తొలి వందేభారత్ రైలు ఇది అని అన్నారు. దేశంలో డిజైన్ చేసిన, దేశంలో తయారు చేసిన రైలు ఇది చెప్పారు ప్రధాని. అతితక్కువ కాలంలో 7వందే భారత్ రైళ్లు ప్రారంభించామని వివరించారు. ఈ రైళ్లల్లో ఇప్పటికే 40 లక్షలకు పైగా ప్రజలు ప్రయాణించారు చెప్పారు ప్రధాని. గమనం ఎక్కడ ఉంటుందో.. ప్రగతి అక్కడ ఉంటుందన్నారు. గమనానికి, ప్రగతికి వందేభారత్ నిదర్శనం అని పేర్కొన్నా ప్రధాని మోదీ. ఇక పెద్ద గమ్యాలకు కూడా మనం చేరువు అవుతామని చెప్పారు.
వందే భారత్ ట్రైన్‌ని ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..