AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhubharati: ధరణి కంటే భూభారతి ఏ విధంగా గ్రేట్? రైతుల భూ సమస్యలన్నీ తీరుస్తుందా?

ధరణి ఓ అద్భుతం అన్నారు. ఎంతో కసరత్తు చేసి మరీ కొత్త చట్టం తీసుకొచ్చామన్నారు. కాని, క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా కనిపించింది. ధరణిని సెట్‌రైట్ చేస్తున్న కొద్దీ కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. మరి.. భూభారతి ఎలా ఉండబోతోంది? ఎలాంటి సమస్య లేకుండా పరిష్కారం లభిస్తుందా?

Bhubharati: ధరణి కంటే భూభారతి ఏ విధంగా గ్రేట్? రైతుల భూ సమస్యలన్నీ తీరుస్తుందా?
Bhoo Bharati
Balaraju Goud
|

Updated on: Dec 18, 2024 | 10:05 PM

Share

ధరణి.. ఇకపై భూ భారతిగా మారుతోంది. ధరణి స్థానంలో భూమాతను తెస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే.. భూ సమస్యల నివారణకు తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది. భూ దస్త్రాలు, యాజమాన్య హక్కుల చట్టం-2024 బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్‌ఓఆర్‌-2020 స్థానంలో కొత్తగా భూ భారతి బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. 2 కోట్ల 76 లక్షల ఎకరాలు. ఇదీ తెలంగాణ భూభాగం. మరి ఇందులో ప్రభుత్వ భూమి ఎంతో ప్రభుత్వానికి తెలుసా..? కచ్చితంగా తెలీదు..! అటవీ, రెవెన్యూ శాఖల మధ్య ఓ వివాదం ఉంది. చిన్న గొడవ కాదు.. 5 లక్షల ఎకరాలకు సంబంధించింది అది. అంటే.. అటవీశాఖ కింద ఎంత భూమి ఉంది. రెవెన్యూ శాఖ కింద ఎన్ని ఎకరాలు ఉన్నాయో తెలీదన్నట్టేగా? ఆశ్చర్యం ఏంటంటే.. ఓ పదేళ్ల క్రితం భూమి అమ్మేసిన వ్యక్తికి.. సడెన్‌గా అతని పేరు మీదకి ఆ భూమే వచ్చి చేరింది. ఇది మ్యాజిక్‌ కాదు.. ఒక యదార్థం. భూమి తన పేరు మీదే ఉందనుకుని గుండెలపై చేతులు వేసుకుని హాయిగా నిద్రపోతున్న వ్యక్తికి.. సడెన్‌గా ‘మీ పేరు మీద అసలు భూమే లేదే’ అనే వార్త తెలిసింది. పోనీ ఎవరైనా కబ్జా చేశారా అంటే.. అదేం కాదు. కాని, అతని పేరు మీద భూమి లేదంతే..! ఇలాంటి...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి