Hyderabad: ఈ 5రోజులు ఆకాశంలో అద్భుతం.. హైదరాబాద్‎లోనూ వీక్షించవచ్చు..

ఆకాశంలో తరచూ ఏదో ఒక అద్భుతం జరుగుతూ ఉంటుంది. రకరకాల గ్రహణాలు ఒక సారి సంభవిస్తే మరోసారి వింత రంగుల్లో చంద్రుడు దర్శనమిస్తాడు. బ్లూమూన్, రెడ్ మూన్ ఇలా అనేక రకాల మూన్స్ ని మనం ఇది వరకూ పౌర్ణమి రోజుల్లో చూసి ఉంటాం. అయితే ఈ వారంలో మరో అద్భుతం ఆకాశంలో ఆవిష్కృతం కానుంది. ఈ విషయాన్ని హైదరాబాద్ కి చెందిన ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరక్టర్ శ్రీరఘునందన్ కుమార్ తెలిపారు.

Hyderabad: ఈ 5రోజులు ఆకాశంలో అద్భుతం.. హైదరాబాద్‎లోనూ వీక్షించవచ్చు..
Planetary Society Of India

Updated on: Dec 16, 2023 | 7:34 AM

ఆకాశంలో తరచూ ఏదో ఒక అద్భుతం జరుగుతూ ఉంటుంది. రకరకాల గ్రహణాలు ఒక సారి సంభవిస్తే మరోసారి వింత రంగుల్లో చంద్రుడు దర్శనమిస్తాడు. బ్లూమూన్, రెడ్ మూన్ ఇలా అనేక రకాల మూన్స్ ని మనం ఇది వరకూ పౌర్ణమి రోజుల్లో చూసి ఉంటాం. అయితే ఈ వారంలో మరో అద్భుతం ఆకాశంలో ఆవిష్కృతం కానుంది. ఈ విషయాన్ని హైదరాబాద్ కి చెందిన ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరక్టర్ శ్రీరఘునందన్ కుమార్ తెలిపారు. డిశంబర్ 16 నుంచి 20 వరకూ రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకూ కనిపిస్తాయని తెలిపారు. అయితే రకరకాల సమయాల్లో ఇవి గగనతలంపై దర్శనమిస్తాయన్నారు.

గురు, అంగారక గ్రహాలు ఆకాశంలో కనిపించడం చూశాం. ఇవి భూమికి దగ్గరగా వచ్చినప్పుడు దేదీప్యంగా ఎరుపు, పసుపు రంగుల్లో వెలుగుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం మనకు ఉల్కలు కనిపిస్తాయంటున్నారు అంతర్జాతీయ ఉల్కాపాత నిపుణులు. అసలు ఇవి ఎలా ఉత్పత్నమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పాథియాన్‌ అనే గ్రహశకలం సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో కొద్దినెలల క్రితం భూకక్ష్యలోకి ప్రవేశించింది.

ఇది కొన్ని పదార్థాలతో కలిసి రాపిడికి గురైంది. ఇలాంటి క్రమంలో చిన్న చిన్న ఉల్కలుగా రాలి భూమిపై పడుతుంది. ఈ క్రమంలో ఇవి గంటకు 150 కాంతి పుంజాలను వెదజల్లుతాయని ఐఎంఓ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ ఈ ఉల్కాపాతాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయని చెబుతున్నారు. వాటిని ప్రత్యక్షంగా వీక్షించిన వారు తమ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి ఐఎంఓ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయవచ్చని పేర్కొంది. మన హైదరాబాద్‎లో కూడా వివిధ సమయాల్లో ఇవి కనిపిస్తాయని అంటున్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..