తెలంగాణలో అత్యంత సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నాళ్లు అరెస్ట్‌లు, దర్యాప్తులు, విచారణల తర్వాత- ఈ కేసులో ఫస్ట్ బెయిల్ వచ్చింది. మాజీ ఏఎస్పీ తిరుపతన్నకు బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ట్యాపింగ్ కేసులో 10 నెలలుగా జైల్లో గడిపారు మాజీ పోలీస్ అధికారి తిరుపతన్న బెయిల్ అనంతరం విడుదల కానున్నారు.రాజకీయ నేతల ఆదేశాల మేరకు అందరి ఫోన్లను ట్యాప్ చేశారని, హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇందులో ఉన్నాయని మాజీ ఏఎస్పీ తిరుపతన్నపై ఆరోపణలు ఉన్నాయి. ఆధారాలు చెరిపేయడంలోనూ ఆయనదే కీలక పాత్ర అనే అభియోగాలు కూడా ఉన్నాయి. 2023 డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు రాగానే ఆధారాలు ధ్వంసం చేసిట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆరెస్టైన తిరుపతన్న పది నెలలుగా జైలులో ఉండగా.. తాజాగా ఆయనకు బెయిల్ ఇచ్చింది సుప్రీం కోర్ట్.
వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ కేస్ లో అరెస్ట్ అయ్యిన వారిలో మొదటి వ్యక్తి తిరుపతన్న.. ఫోన్ ట్యాపింగ్ కేసులో నలుగురిని గత ఏడాదిలో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.. అడిషనల్ ఎస్పీ ప్రణీత్ రావ్, అడిషనల్ ఎస్పీ భుజంగ రావ్, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావ్ లను పోలీసులు అరెస్ట్ చేసారు. దాదాపు 10 నెలలకు పైగా జైల్ లోనే ఉన్నారు. బయటికి వచ్చేందుకు అనేక సార్లు బెయిల్ పిటిషన్ లు దాఖలు చేసినప్పటికీ రిజెక్ట్ అవుతూ వచ్చాయి.
హై కోర్టులో పలుమార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ ఇక్కడ ఊరట లభించలేదు. తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించగా అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తిరుపతన్నను గత ఏడాది 24న ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అదే సమయంలో మరో అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఉన్న సైతం పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ అనేకసార్లు లోయర్ కోర్టుతో పాటు హైకోర్టులోను బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటివరకు ఎవరికీ పూర్తిస్థాయిలో బెయిల్ మంజూరు కాలేదు.
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. రాజకీయ ప్రత్యర్ధులు, హైకోర్టు జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు పోలీసులు ఆరోపణలు మోపారు.. వీటికి సంబంధించి కోర్టులో ఇంకా కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ పొందిన మొదటి వ్యక్తి తిరుపతన్న.. సుప్రీం కోర్టు ఆదేశాలతో జైలు నుంచి విడుదల కానున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..