Petrol Diesel Price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాలు..!

|

Jan 06, 2022 | 12:16 PM

దేశ వ్యాప్తంగా చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సంస్థ ఇండియన్ ఆయిల్ (IOCL) పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లను విడుదల చేసింది. తాజాగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో..

Petrol Diesel Price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాలు..!
Follow us on

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇండియన్ ఆయిల్ (IOCL) పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లను విడుదల చేసింది. తాజాగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చిన్న చిన్న తేడాలతో ధరలు కనిపిస్తున్నాయి. మంగళవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని చాలా చోట్ల ధరల్లో కొద్దిగా తగ్గినట్లుగా కనిపించాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.39గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.79గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.29గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.47గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.37గా ఉండగా.. డీజిల్ ధర రూ.94.69గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.62 ఉండగా.. డీజిల్ ధర రూ.95.01గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.91కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.96లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.75 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.83గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.71లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.72గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.28గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.38గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.91లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.96లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.50 ఉండగా.. డీజిల్ ధర రూ.91.52గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.33 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.85గా ఉంది.

ఇవి కూడా చదవండి: Drink and Drive Fine: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికాడు.. తన వెహికిల్‌ని తానే తగలబెట్టుకున్నాడు.. ఎందుకో తెలుసా..

CM KCR: లాక్‎డౌన్ విధించాల్సిన అవసరం లేదు.. కానీ జాగ్రత్తగా ఉండాలి..