
రేబిస్ వ్యాధితో లేగ దూడ ప్రాణాలు కోల్పోయింది. బిడ్డ మృతితో తల్లి ఆవు తల్లడిల్లింది. మృతి చెందిన దూడను ఎడ్ల బండిలో తరలిస్తుండగా.. తల్లి ఆవుతో పాటు మిగిలిన గోవులు సైతం పరుగులు పెట్టాయి. తల్లి ప్రేమను చాటిచెప్పిన మూగజీవాలను చూసిన జనం కళ్లు చెమ్మగిల్లాయి.
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో రామాలయం కు చెందిన ఓ లేగ దూడ కుక్క కాటుకు గురై రేబిస్ వ్యాధితో మృతి చెందింది. తన లేగ దూడ కళ్ళముందే చనిపోవడంతో తల్లి ఆవు అంబా అంటూ రోదించడం పలువురిని కలిచి వేసింది. మృతి చెందిన లేగ దూడను ఎడ్లబండిపై స్మశాన వాటికకు తరలిస్తుండగా తల్లి ఆవు ఎడ్ల బండిని అనుకరించింది. తల్లి అవుతోపాటు తోటి గోవులు స్మశాన వాటికకు వెళ్లడం గమనార్హం.
లేగ దూడ మరణంపై గోవులు చూపిన సానుభూతి, అనురాగం ప్రేమను స్థానికులు గమనించి భావోద్వేగానికి గురయ్యారు. తల్లి ప్రేమ అంటే ఏమిటో చూపిన గోవులను చూసి మనుషులు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..