ఆర్టీసీ బస్సులో మోదీ హల్‌చల్‌

ఆర్టీసీ బస్సులో మోదీ హల్‌చల్‌

రాముడు – భీముడు, గంగ- మంగ, అపూర్వ సోదరులు, హలోబ్రదర్స్‌, వంటి తెలుగు సినిమాల్లో ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండటం మనం చూశాం. అయితే, నిజ జీవితంలో కూడా ఇలా ఒకే పొలికతో ఉన్న వ్యక్తులు దాదాపుగా ట్వీన్స్‌గా పుట్టడం లేదా.. రక్తసంబంధం కలిగి ఉండటం మనం గమనిస్తుంటాం.  కానీ, మనిషిని పోలిన మనిషి అనుకోకుండా తారసపడితే..? వారి మధ్య ఎలాంటి రక్తసంబంధం లేకపోతే, ఆశ్చర్యం వేయక మానదు. అలా భూమ్మీద మనిషిని పోలిన మనుషులు ఏడుమంది […]

Pardhasaradhi Peri

|

Aug 26, 2019 | 8:34 PM

రాముడు – భీముడు, గంగ- మంగ, అపూర్వ సోదరులు, హలోబ్రదర్స్‌, వంటి తెలుగు సినిమాల్లో ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండటం మనం చూశాం. అయితే, నిజ జీవితంలో కూడా ఇలా ఒకే పొలికతో ఉన్న వ్యక్తులు దాదాపుగా ట్వీన్స్‌గా పుట్టడం లేదా.. రక్తసంబంధం కలిగి ఉండటం మనం గమనిస్తుంటాం.  కానీ, మనిషిని పోలిన మనిషి అనుకోకుండా తారసపడితే..? వారి మధ్య ఎలాంటి రక్తసంబంధం లేకపోతే, ఆశ్చర్యం వేయక మానదు. అలా భూమ్మీద మనిషిని పోలిన మనుషులు ఏడుమంది దాకా ఉంటారని మన పెద్దలు చెబుతుంటారు. అటువంటి మనుషులు అప్పుడప్పుడు మనకు తారాపడుతుంటారు. అయితే, ప్రధాని నరేంద్రమోదీని పోలిన మనుషులు కూడా దేశంలో చాలా చోట్ల ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కూడా మోదీ పోలికలతో ఉన్న ఓ వ్యక్తి ఇప్పుడు బాగా ఫేమస్‌ అయ్యాడు. తనతో చాలా మంది సెల్ఫీలు దిగుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు, కామెంట్లు, లైకులతో హల్‌చల్‌ చేస్తున్నాడు.ఆదిలాబాద్‌ జిల్లాలోని బొక్కలగూడకు చెందిన షేక్‌ అయ్యూబ్‌ అనే వ్యక్తి చూడటానికి అచ్చం మోదీలానే ఉన్నాడు. ఆయన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొత్తగా బస్సు ఎక్కిన ఎవరైనా సరే ఆయన్ను చూడగానే మోదీ అనుకోని షాక్‌ అవుతున్నారు. జట్టు, ముఖ కవళికలు,నడక అన్ని మోదీలా ఉన్నాయి. బస్సు ఎక్కిన చాలా మంది ఆయనతో సెల్సీలు దిగుతుంటారు. ఇన తను పనిచేస్తున్న డిపోలో కూడా అందరూ తనను తెలంగాణ మోదీగా కితాబిచ్చారు. అయూబ్‌ కుటుంబ సభ్యులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu