CM Revanth Reddy: ప్రజాదర్భార్‎కు పోటెత్తిన ప్రజలు.. సీఎంకు వినతుల వెల్లువ..

| Edited By: TV9 Telugu

Dec 15, 2023 | 2:05 PM

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఒక వేదికను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా దర్భార్ ను ఏర్పాటు చేశారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు.

CM Revanth Reddy: ప్రజాదర్భార్‎కు పోటెత్తిన ప్రజలు.. సీఎంకు వినతుల వెల్లువ..
Cm Revanth Reddy
Follow us on

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఒక వేదికను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా దర్భార్ ను ఏర్పాటు చేశారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ రోజు శుక్రవారం కావడంతో ప్రజావాణి కార్యక్రమానికి సామాన్యుల నుంచి భారీ స్పందన లభించింది. హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతి రావ్ ఫులే ప్రజాభవన్‌కు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఉదయం 10 గంటల వరకూ వచ్చిన వారికి మాత్రమే అర్జీలు ఇచ్చేందుకు అవకాశం ఉండటంతో ముందుగా బేగంపేటకు ప్రజాభవన్ కు చేరుకున్నారు.

తమ సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఈ నెల 8న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తొలి రోజు నుంచే విశేష స్పందన లభిస్తోంది. బేగంపేట నుంచి పంజాగుట్ట ఫ్లై ఓవర్ వరకూ అర్జీదారులు బారులు తీరారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ మార్గం మొత్తం తీవ్ర ట్రాఫిక్ ఏర్పాడింది. ప్రజాభవన్ వద్ద ఎలాంటి వాహనాలు నిలిపేందుకు అవకాశం ఇవ్వకుండా ముందుకు పంపుతూ ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నారు. తమకు రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, పెన్షన్లు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని అధిక సంఖ్యలో వినతులు ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..