Revanth Reddy: హాట్ టాపిక్ గా మారిన కోమటిరెడ్డి కామెంట్స్.. స్పందించిన రేవంత్.. ఏమన్నారంటే..

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యా్ఖ్యలను.. సొంత పార్టీ నేతలూ ఖండిస్తున్నారు. ఆయన చేసిన కామెంట్స్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరూ మాట్లాడినా..

Revanth Reddy: హాట్ టాపిక్ గా మారిన కోమటిరెడ్డి కామెంట్స్.. స్పందించిన రేవంత్.. ఏమన్నారంటే..
Revanth Reddy

Updated on: Feb 15, 2023 | 1:30 PM

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను.. సొంత పార్టీ నేతలూ ఖండిస్తున్నారు. ఆయన చేసిన కామెంట్స్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరూ మాట్లాడినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. అలా మాట్లాడిన వారిపై అధిష్టానం అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని వరంగల్ లో రాహుల్ గాంధీ స్పష్టం చేశారన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ పొత్తు ఉంటుందని ఎంతపెద్ద నాయకుడు మాట్లాడినా చర్యలు తప్పవని రాహుల్ గాంధీ ఆరోజే చెప్పారన్నారు. పార్టీకి నష్టం కలిగేలా ఎవరూ మాట్లాడవద్దని కోరారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

కాగా.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి 60 సీట్లు కూడా రావని.. ఆ పరిస్థితిలో కాంగ్రెస్‌తో కలవడం ఒక్కటే బీఆర్‌ఎస్‌కు ఉన్న మార్గమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ చేశారు. అందుకే వచ్చే ఎన్నికల ముందు ఎలాంటి పొత్తులు లేకపోయినా ఫలితాల తర్వాత మాత్రం కచ్చితంగా పొత్తులతో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. ప్రభుత్వ ఏర్పాట్లో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

మరోవైపు.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందిస్తూ.. కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ అర్థం కాదని విమర్శించారు. ఎవరు ఏ పార్టీలో ఉంటారో వారికే తెలియదని, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం